ఎంత ధైర్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో బాహాటంగా అవకాశాలు వస్తున్నాయంటే అదీ లేదు. పోనీ తెలుగులో అన్నా టాప్ హీరో సరసన అవకాశం వస్తే చేద్దామన్న ఆశే లేదు. ఎందుకూ? అనంటే తన కారణం తాను చెబుతోంది అలియాభట్. ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిస్తున్న ‘సాహో’ చిత్రానికి మొదట కథానాయికగా అలియాభట్‌నే ఎంపిక చేశారు. అయితే ఈ కథ విన్నాక తన పాత్ర చాలా తక్కువ వున్నది అన్న కారణం చూపించి ఆ సినిమాకు నో చెప్పిందట అలియా. ఈ విషయం ఇటీవలే బాలీవుడ్‌లో వినపడుతున్న వార్త. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని చేయమని సలహా ఇచ్చినా అలియా వ్యితిరేకించిందట. చివరికి సినిమా యూనిట్ శ్రద్ధాకపూర్‌ను ఎంపిక చేసింది. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని వదులుకోవడం అలియాకు మైనస్ పాయింటేనని ముంబాయి మీడియా చెబుతోంది. అయితే ఈ చిత్రంలో ఇప్పుడు వినిపిస్తున్న వార్త ప్రకారం కథానాయిక ద్విపాత్రాభినయంతో కనిపిస్తుందట. అలాగా! అయితే మంచి పాత్రనే అలియా వదులుకున్నట్లే మరి!