మేరా భారత్ మహాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఖిల్ కార్తిక్, ప్రియాంక శర్మ జంటగా ప్రధా ప్రొడక్షన్స్ పతాకంపై భరత్ దర్శకత్వంలో శ్రీ్ధర్‌రాజు ఎర్ర, తాళ్లరవి, టి.పి.ఆర్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘మేరా భారత్ మహాన్’. సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. దర్శకుడు బి.గోపాల్ క్లాప్‌నివ్వగా, చంద్రబోస్ కెమెరా స్విచ్చాన్ చేశారు. సాగర్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ- సమకాలీన అంశాలకు కమర్షియల్ హంగులను జోడించి సందేశాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తున్నామని, ముగ్గురు మిత్రులు కలిసి రూపొందిస్తున్న ఈ సినిమా దేశం బాగుపడాలంటే యువత ముందుకు రావాలని, సమాజంలో సమస్యలను అరికట్టే బాధ్యత వారిదేనని తెలుపుతూ చైతన్యపరిచేలా వుంటుందని అన్నారు. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందిస్తున్న ఈ సినిమా ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరమైన సినిమా అని, లవ్‌స్టోరీతోపాటు కామెడీ కూడా వుంటుందని వారు తెలిపారు. దేశానికి ఉపయోగపడే కథాంశంతో రూపొందిస్తున్న ఈ సినిమాలో మంచి పాత్రలు దొరికినందుకు సంతోషంగా వుందని కథానాయకుడు అఖిల్ కార్తీక్, ప్రియాంక శర్మ అన్నారు. ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో కూడా నటిస్తున్నారని, వారి పేరును త్వరలో ప్రకటిస్తామని, సామాన్యులకు విద్య, వైద్యం అందుబాటులో వున్నపుడే సమాజం బాగుంటుందనే అంశం ఈ చిత్రంలో ఉంటుందని దర్శకుడు భరత్ అన్నారు. కేరళలో రెండు పాటల చిత్రీకరణ తరువాత వరంగల్‌లో 25 రోజులపాటు షూటింగ్ చేయనున్నామని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఏప్రిల్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన అన్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, సాయిచంద్, ఎల్.బి.శ్రీరాం, సన, ప్రగతి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.