నాగశౌర్య హీరోగా చిత్రం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ కథానాయకుడు నాగశౌర్య నూతన చిత్రం సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ క్లాప్‌నిచ్చారు. కెమెరా స్విచ్‌ఆన్ ప్రముఖ దర్శకుడు మారుతి చేశారు. అలాగే దర్శకుడు మారుతి, రచయిత కోన వెంకట్‌లు ఈ చిత్రం స్క్రిప్ట్‌ను చిత్ర దర్శక నిర్మాతలకు అందజేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి, వి.ఐ.ఆనంద్, ఉపేంద్రలు ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. మన్యం ప్రొడక్షన్స్ తమ తొలి ప్రయత్నంగా నాగశౌర్య కథానాయకుడిగా, ఛాయాగ్రాహకుడు సాయిశ్రీరామ్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మేం వయసుకు వచ్చాం, అలా ఎలా, సుప్రీం, పిల్లజమిందార్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ప్రస్తుతం నాగశౌర్య ‘చలో’ చిత్రాలకు శ్రీరామ్ ఛాయాగ్రాహకునిగా పనిచేశారు. దర్శకుడు సాయి శ్రీరా చెప్పిన కథలోని నవ్యత, చత్ర కథనం ఎంతగానో నచ్చి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు నిర్మాత ఎం.విజయకుమార్ తెలిపారు. చిత్ర కథానాయిక, ఇతర తారాగణం త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత ఎం.విజయకుమార్ తెలిపారు. జనవరి 2018లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రధన్, కథ: విద్యాసాగర్‌రాజు, మాటలు: విశ్వనేత్ర, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, నిర్మాత: యం.విజయకుమార్, దర్శకత్వం: సాయి శ్రీరామ్