‘అజ్ఞాతవాసి’ పాటలొస్తున్నాయ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ కలయికలో ‘అజ్ఞాతవాసి’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మొదటి పాటకు మంచి స్పందన లభించడంతో రెండో పాటను కూడా విడుదల చేయనున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియోను డిసెంబర్ 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్ కూడా మంచి స్పందన లభించింది. ప్రస్తుతం కాశిలో షూటింగ్ చేస్తున్న ఈ సినిమా యూనిట్ వచ్చేనెల 10న హైదరాబాద్ రానుంది. 12 నుండి పవన్ డబ్బింగ్ మొదలుపెడతారని సమాచారం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడావేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా తరువాత పవన్ ఏ సినిమా చేస్తాడు అన్న విషయంపై టాలీవుడ్‌లో చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాదికి సంక్రాంతికి విడుదలకానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. నిర్మాతలు ఆయనతో సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్నా పవన్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదట. ఎలెక్షన్లు దగ్గర పడుతుండడంతో పూర్తిగా రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్ భోగట్టా. అయితే తరువాత చిత్రాన్ని వెంటనే మొదలు పెట్టాలని అనుకుంటున్నారని మరో వార్త. కోలీవుడ్‌లో అజిత్ చేసిన ‘వేదాళం’ చిత్రానికి రీమేక్‌గా కొత్త చిత్రం ఉంటుందట. ఎ.ఎం.రత్నం ఈ సినిమా రూపొందిస్తుండగా, నేసన్ దర్శకత్వం వహిస్తాడు. అన్నీ కుదిరితే ఈ సినిమా జనవరిలో మొదలుకానున్నదట.