స్టార్‌డమ్ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘జవాన్ చిత్రంలో సోషల్ మెసేజ్ వున్నా పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కింది. ఆర్‌ఎస్‌ఎస్ స్టూడెంట్‌గా నటించా. అన్ని రకాల చిత్రాలు చేయడానికి సిద్ధం. కథ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేస్తా’’ అని హీరో సాయిధరమ్ తేజ్ తెలిపారు. అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ‘జవాన్’ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ పలు విశేషాలు తెలిపారు.
సామాజిక సందేశంతో..
‘జవాన్’ సినిమా టైటిల్ కింద క్యాప్షన్‌లో చెప్పినట్లు ఇంటికి ఒకడు జవాన్ ఉండాలని ఈ చిత్రంలో చెప్పే ప్రయత్నం చేశాం. నిజానికి ఈ కథను 2015లోనే విన్నా. నచ్చి చేయడానికి ముందుకు వచ్చా.
టీజింగ్ సన్నివేశాలు
మెహరీన్ పాత్ర సరికొత్తగా వుంటుంది. ఆమె కూడా అద్భుతంగా నటించింది. ఒకరకంగా నన్ను డామినేట్ చేసి టీజ్ చేసే పాత్ర అది. ఇంతవరకూ నా సినిమాల్లో నేనే హీరోయిన్‌ను టీజ్ చేసిన సన్నివేశాలు ఉంటాయి. విన్నర్ సినిమా తరువాత హీరోయిన్లను టీజ్ చేసే సన్నివేశాలు చేయకూడదని నిర్ణయించుకున్నా. అలా చేయడం తప్పనిపించింది.
ఒకేలా తీసుకుంటా..
ఈమధ్య వరుసగా పరాజయాలు వచ్చాయి. నేను ఏ సినిమా అయినా కథ విన్న తరువాతే ఓకె చేస్తా. సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు పెట్టుకోను. ఎందుకంటే మన పని మనం ఖచ్చితంగా చేశామా లేదా అన్నదే చూసుకుంటా. విజయాలైనా పరాజయాలైనా ఒకేలా తీసుకుంటా.
నక్షత్రం నష్టం
నక్షత్రం సినిమా విషయంలో బాగా ఇబ్బంది పడ్డానని అంటున్నారు. నిజానికి కృష్ణవంశీతో సినిమా చేయాలని ఎప్పుడో అనుకున్నా. నక్షత్రంలో ఆయన అవకాశం ఇచ్చాడు, చేశా. ఆయనతో పనిచేయడం మంచి అనుభూతి. నటుడిగా ఎంతో నేర్చుకున్నా. ఇక సినిమా ఫ్లాప్ విషయంలో నేనేమీ పెద్దగా బాధపడలేదు. ఆయన మరోసారి నాతో చేస్తానన్నా సిద్ధమే.
స్టార్‌డమ్ గురించి పెద్దగా పట్టించుకోను. కథ నచ్చితే సినిమా చేయడానికి ముందుకు వస్తా. ఒకే సినిమా మొత్తం నాపై ఉండాలని, నేనే మోసెయ్యాలని అనుకోను. ఆ స్థాయికి నేను ఇప్పటికీ రాలేదనుకుంటా. నటుడిగా భిన్నమైన సినిమాలు చేయాలని అనుకుంటాను.
తదుపరి సినిమాలు

వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ఇప్పటికే అది అరవై శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. పక్కా మాస్ అంశాలతో వినాయక్ స్టయిల్‌లో వుంటుంది. కరుణాకరన్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నా. ఇంకో సినిమా చర్చల దశలో వుంది.

- శ్రీ