షూటింగ్‌లో బిజీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘్భరత్ అనే నేను’ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలావరకు షూటింగ్ ముగించుకొన్న ఈ చిత్రం ఇంకో మూడు షెడ్యూళ్లల్లో మొత్తం చిత్రీకరణను ముగించుకోనుంది. ఈ మూడు షెడ్యూల్స్‌లో ఒకటి నేటి నుండి డిసెంబర్ 7వరకు హైదరాబాద్‌లో జరగనుంది. దీని తర్వాత డిసెంబర్ 10 నుండి 25 వరకు తమిళనాడులోని కారైకుడిలో మరొక షెడ్యూల్ జరగనుంది. ఇవి కాకుండా మూడు పాటలు, ఒక ఫైట్‌ను వచ్చే ఏడాది ఆరంభంలో చిత్రీకరించనున్నారు. ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2018 ఏప్రిల్ 17న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కైరా అద్వానీ హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.