ఇబ్బంది మాట నిజమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిగ్ బి అమితాబ్‌బచ్చన్ ఇటీవల చాలా ఇబ్బందికి గురైన ఓ సన్నివేశాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇటీవల గోవాలో జరిగిన ఐఫా చిత్రోత్సవంలో ఆయన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన అక్షయ్‌కుమార్, అమితాబ్ స్టేజిపైకి వచ్చేముందు కాళ్ళకు వంగి నమస్కరించబోయారట. వెంటనే అక్షయ్‌ని వారించి ఆలింగనం చేసుకుని బిగ్ బి వెళ్లిపోయారు. కానీ ఆయనకు ఇబ్బంది కలిగించిందట ఈ సంఘటన. అందుకే అక్షయ్ అలా చేయకుండా వుంటే బాగుండేదని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. ప్రస్తుతం అమితాబ్, 102 నాటౌట్, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్, బ్రహ్మాస్త్ర చిత్రాలలో నటిస్తూ ఎవర్‌గ్రీన్‌గా తన హవా కొనసాగిస్తున్నారు. తెలుగులోనూ సైరా నరసింహారెడ్డి చిత్రంలో కనిపించనున్నారు. మొత్తానికి అమితాబ్‌కు గుర్తుండిపోయేలా ఇబ్బంది కలిగించిన సంఘటనను ఇలా నలుగురికీ తెలిసేలా ట్వీట్ చేయడం బాలీవుడ్‌లో ఆశ్చర్యానికి గురిచేస్తోంది.