30 రోజుల్లోనే ‘మళ్లీ రావా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటివరకు నేను 22 చిత్రాల్లో నటించా. వాటిలో గోదావరి, గోల్కొండ హైస్కూల్ సినిమాల కథలకు దగ్గరగా వుంటుంది మళ్లీరావా కథనం. 30 రోజుల్లోనే ఈ చిత్రాన్ని చక్కగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. కామెడీ సినిమాలో హైలెట్‌గా వుంటుంది అని కథానాయకుడు సుమంత్ తెలిపారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సుమంత్, ఆకాంక్షాసింగ్ జంటగా నటించిన చిత్రం ‘మళ్లీ రావా’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్క రూపొందించారు. ఈ సినిమా ఈనెల 8న విడుదలకు సిద్ధమైంది. సినిమా విశేషాలను చిత్రయూనిట్ తెలిపింది. ఇంకా సుమంత్ మాట్లాడుతూ- కామెడీ హైలెట్‌గా సాగే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌లో ఆ సన్నివేశాలేమీ పెట్టలేదని, అవన్నీ లేకుండానే ట్రైలర్ ప్రేక్షకులకు నచ్చిందని ఆయన అన్నారు. గోదావరి తరువాత నేను చేసిన నిజాయితీ వున్న సినిమా ఇదని ఆయన అన్నారు. మంచి కథతో రూపొందిన ఈ సినిమాను సిన్సియర్‌గా హానెస్టుగా తమ టీమ్ కష్టపడి రూపొందించిందని, దాదాపు పది నెలలు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరిపామని నిర్మాత రాహుల్ యాదవ్ తెలిపారు. ఈ కథను తాను రెండు సంవత్సరాలు రాసుకున్నానని, అనేకమందికి కథ నచ్చినా సినిమాగా రూపొందించడానికి ముందుకు రాలేదని, నేచురల్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమాకు అన్ని హంగులు చక్కగా కుదిరాయని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి వివరించారు. ఈ చిత్రానికి కెమెరా:సతీష్ ముత్యాల, సంగీతం:శ్రవణ్, దర్శకత్వం:గౌతమ్ తిన్ననూరి.