‘వాళ్లమ్మాయి’ ఓ సీతకథే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లవ్‌లీ, ఉయ్యాల జంపాల, కృష్ణగాడి వీరప్రేమగాథ, బాహుబలి చిత్రాల్లో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ కథానాయకుడిగా చైతన్యకృష్ణ దర్శకత్వంలో భక్తి క్రియేషన్స్ పతాకంపై ప్రవీణ్ సిద్ధాంత్ రూపొందిస్తున్న చిత్రం ‘వాళ్లమ్మాయి’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఉదయం రామానాయుడు స్టూడియోలో జరిగింది. ముహూర్తపు సన్నివేశంపై దర్శకురాలు జయ.బి క్లాప్‌నివ్వగా, రాజ్ కందుకూరి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి శేఖర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- 2001లో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, సమాజానికి ఉపయోగపడే సందేశం సినిమాలో వుంటుందని, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయని తెలిపారు. రావణుడు సీతను లంకకు తీసుకెళ్లి ఎన్ని హింసలకు గురిచేశాడో, ఆ సమయంలో సీత ఎన్ని కష్టాలు పడిందో అందరికీ తెలుసని, అయితే ఈ సమాజంలో రావణాసురులమధ్య నలిగిపోతున్న ఓ సీత కథే ఈ చిత్రమని ఆయన తెలిపారు. దుర్మార్గుల బారిన పడి నలిగిపోయిన ఓ అమ్మాయిని హీరో ఎలా రక్షించాడు? అన్న కోణంలో లవ్ సెంటిమెంట్ ఎమోషన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నామని ఆయ న అన్నారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటుగా సమాజానికి సందేశం అందించే ప్రయత్నంలో ఈ సినిమా రూపొందిస్తున్నామని నిర్మాత ప్రవీణ్ సిద్ధాంత్ అన్నారు. ఈ నెల 25 నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ చేస్తామని, ఒకే షెడ్యూల్‌లో పూర్తిచేయనున్న ఈ సినిమాకు సంబంధించిన పాటలను ఔట్‌డోర్‌లో చిత్రీకరిస్తామని ఆయన అన్నారు. కమల్.వి.వి., సంగీత దర్శకురాలు కౌశల్య పాల్గొని విశేషాలు తెలిపారు.