ఏది చరిత్ర? ఏది కల్పన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచిన్నతనంలో (1940) మొసలికంటి తిరుమలరావు అనే రచయిత ‘మొగలాయి దర్బారు’ అనే నాలుగు భాగాల నవలను రచించాడు. మొగలులకు రెండే తెలుసు. ఒకటి కత్తి- రెండవది కామం. అంటే యుద్ధాలు చేసి రాజ్యాలను కలుపుకోవటం, ఎక్కడ అందమైన పిల్ల కనపడితే ఆమెను అపహరించుకొని వచ్చి తమ జనానాలో చేర్చుకోవటం.
సమర్‌ఖండ్‌కు చెందిన బాబరు ఇండియాపైకి దండయాత్ర చేయటంతో మొగలుల చరిత్ర మొదలయింది. అంతకుముందు ఢిల్లీ సింహాసనాన్ని ఖిల్జీలు లోడీలు పరిపాలించారు. దక్షిణ భారతంలో కాకతీయ సామ్రాజ్యం 1323 వరకు ఈ ఉత్తరాది దండయాత్రలకు అడ్డుకట్ట వేయగలిగింది. కాని మాలిక్ కాపర్, ఉలుగ్‌ఖాన్‌ల దండయాత్రలలో కాకతీయ భానుడు అస్తమించాడు. మధ్యలో కాపయ నాయకుడు ప్రోలిమ నాయకుడు అనే ఇద్దరు కమ్మరాజులు హిందూ ధర్మాన్ని రక్షించటం కోసం ఒక చిన్న ప్రయత్నం చేసి ఓరుగల్లును స్వాధీనం చేసుకున్నారు కాని వీరి రాజ్యం ఎక్కువ కాలం నిలువలేదు.
ఈ చారిత్రకాంశాలన్నీ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే సంజయ్‌లీలా భన్సాలీ అనే దర్శకుడు పద్మావతి అనే చిత్రాన్ని నిర్మించటంవలన. దీనిని ఉత్తరాది రాష్ట్రాలు నిషేధించాయి. తెలంగాణలో (హైదరాబాద్) రాజాసింగ్ అనే రాజపుత్రుడు (ఎంఎల్‌ఏ) పద్మావతి సినిమాను నిషేధించాలి అంటూ ఆందోళన మొదలుపెట్టాడు. ఇప్పుడు సూడో సెక్యులరిస్టులు రంగంలోకి దిగారు.
- సినిమాను చూడకుండానే దానిని నిషేధించాలి అనటం రాజకీయ దురుద్దేవ్యంతో కూడుకున్న చర్య.
- ఏది చరిత్ర? ఏది కల్పన? ఎవరు చెప్పగలరు? పద్మావతి చరిత్రయే అభూత కల్పన.
- తినడానికి తిండి- ఉద్యోగం లేని దేశంలో ఈ పద్మావతి చర్చ తప్ప మరొక అంశమే లేదా?
- భారత రాజ్యాంగం 19ఎ (తృతీయధ్యాయంలోని అధికరణం) కింద భావస్వేచ్ఛ ఇచ్చింది.
-కళాకారులకు లైసెన్సు ఉంటుంది.
- రాజస్థాన్‌లో నేడు ఎన్నో దుర్మార్గాలు జరుగుతున్నాయి. వాటిని అడ్డుకోలేని స్థానిక ఎంఎల్‌ఏలు, ఎంపిలు ఎప్పుడో ఏడువందల సంవత్సరాల క్రితం అల్లా ఉద్దీన్ ఖిల్జీ దురంతాలపై ఇపుడు అల్లరి చేయవలసిన అవసరం ఏమిటి?
ఇలా చాలాచాలా వాదాలు తెరపైకి తెచ్చారు.
గతం కాదు నాస్తి - అది అనుభవాల ఆస్తి అని వీరికి తెలియదు. ఇవ్వాళ పద్మావతి కథ కల్పన అంటే రామాయణం, భారతం, భాగవతం అన్నీ కల్పిత కథలే అంటారు. ప్రపంచ చరిత్రను రక్తంలో ముంచిన మంగోలులు అరబ్బులు క్రూసేడర్లు చేసిన దుర్మార్గాలను ఎత్తిచూపటం తప్పు అవుతుందా? రాజ్యాంగంలోని 19ఎ ప్రసాదించిన భావప్రకటన స్వేచ్ఛ పేరుతో మనం ఎవరిని పడితే వారిని అవమానిస్తే రాజ్యాంగం అంగీకరించదు. రాజపుత్ర జాతిని కించపరిచే అధికారంఎవరికీ లేదు.
ఇక సినిమా చూడకుండా ఈ అల్లరి ఏమిటి? అని ప్రశ్న. సినిమా ‘ప్రోమో’ విడుదల అయింది. అందులో పద్మావతి హీరోయిన్. అల్లా ఉద్దీన్ ఖిల్జీ విలన్ హీరో. మహారాణి పద్మావతి వీధి నర్తకిలాగా డాన్సులు చేస్తూ ఉంటుంది. ఈ నిర్మాతలకు అక్బర్, ఔరంగజేబు, అల్లా ఉద్దీన్‌ఖిల్జీ తప్ప మరే చారిత్రకాంశాలూ దొరకలేదా? పైగా శత్రువును గ్లోరిఫై చేస్తూ సినిమాలు తీస్తే వాటికి పాకిస్తాన్, చైనాలల్లో మంచి మార్కెట్ ఉంటుందని వీరి దుర్బుద్ధి.
ఇప్పుడు కొన్ని ప్రామాణిక చారిత్రకాంశాలు మీ ముందు ఉంచుతున్నాను.
సబూర్‌భాయి అనే హిందువు గుజరాత్ ప్రాంతానికి చెందినవాడు. ఇతనిని ‘బానిస’గా పట్టుకొని వచ్చిన ఢిల్లీ సుల్తాన్ అల్లా ఉద్దీన్ ఖిల్జీకి 1290 ప్రాంతంలో అమ్మారు. కాఫిర్ మాలిక్ అనే పేరుతో ఇతడు సుప్రసిద్ధుడైనాడు. ఇతని మర్మాంగం కత్తిరించి నపుంసకుణ్ణి చేశారు. నస్రత్‌ఖాన్, మాలిక్ కాఫర్‌లు ససైన్యంగా మేవాడ్‌లోని రతన్‌సింగ్ రావల్‌ను ఓడించి అంతఃపురాన్ని పట్టుకోవాలని ప్రయత్నించారు. కాని వారికి పెద్ద బూడిద కుప్ప దొరికింది. అల్లా ఉద్దీన్ భార్య మల్లికా బేగం చాలా దురాశాపరురాలు. ఆమె ప్రేరణతో మాలిక్ కాఫర్ దేవగిరి, వరంగల్లు, హాలిసతి, శ్రీరంగం వంటి ఎన్నో ప్రాంతాలను ధ్వంసం చేశాడు. అల్లా ఉద్దీన్ ఖిల్జీని చంపి మాలిక్ కాఫర్ అధికారంలోకివచ్చాడు. నామమాత్రంగా ఖిల్జీ కొడుకును తోలుబొమ్మలాగా సింహాసనంలో కూర్చోబెట్టాడు. తర్వాత వరుసగా ముబారక్ ఖుస్రూ, మాలిక్‌కాఫర్‌లు హత్య చేయబడ్డారు. సింహాసనం ఉలుగ్‌ఖాన్ స్వాధీనం అంది. అతడు మళ్లీ దండయాత్రలు జరిపి ఓరుగల్లును ధ్వంసం చేశాడు. ఇతడే మహమ్మద్ బిన్ తుగ్లక్.
అల్లాఉద్దీన్ ఖిల్జీ మంగోలులను ఏనుగులతో తొక్కించి చంపించాడు. అధికారం కోసం బంధుమిత్రులను హత్య చేయించాడు. ఇతనిని గొప్ప పరిపాలనాదక్షునిగా, ఆర్థిక సంస్కర్తగా సూడో సెక్యులరిస్టుల పాఠ్యగ్రంథాలు అభివర్ణిం

చాయి. రతన్‌సింగ్ రావల్ పరాక్రమం గురించి పద్మిని త్యాగం గురించి వీరు కనీసం ఒక్క లైను కూడా వ్రాయలేదు. ఇలాంటి దుర్మార్గపు చరిత్రను రష్యా-బ్రిటన్ ప్రేరేపిత శక్తులు రూపొందిస్తే వాటిని గత డెబ్భది సంవత్సరాలుగా మనం మన పిల్లలకు నేర్పుతున్నాము. ప్రతాపరుద్రుడి
సేనాని నాగయ్య గన్న నాయకుణ్ణి పట్టుకొని పోయి ముక్బూల్ అని పేరుపెట్టి మతం మార్చి మళ్లీ వరంగల్ మీదికి పంపితే ముక్బూల్ ఓరుగల్లును నామరూపాలు లేకుండా ధ్వంసం చేశాడు. ఐతే మన సినీ కవి ఆరుద్ర ముక్బూల్ దివ్యచరిత్రపై ఒక నాటకం రాశాడు. ఇవ్వాళ ఆరుద్ర లేడు కాని ఆయన అజ్ఞానానికి నిదర్శనంగా ఆయన నాటకం ఉంది.
సంజయ్‌లీలా భన్సాలీ చిత్రంలో ఈ

చరిత్ర లేనే లేదు. ఏవేవో ప్రేమగీతాలు ఉన్నాయి. సెన్సారుకు ముందే ఈ చిత్రాన్ని అర్ణవ్ గోస్వామి వంటి జర్నలిస్టులకు ఎలా చూపించారు? అనే ప్రశ్నను కొందరు లేవదీశారు. ఈ సినిమాకు 200కోట్లు దుబాయ్‌లోని మాఫియాలు పెట్టుబడి పెట్టారు. ఎందుకు?? ప్రజలకు కూడు గుడ్డ ఉద్యోగం చదువు కావాలి అని కమ్యూనిస్టులు వాదిస్తున్నారు. నిజమే అంగీకరిద్దాం. కాని ప్రజలకు చరిత్రను వక్రీభవించే పద్మావతి, టిప్పుసుల్తాన్, మొగల్ ఎ అజాంలు కూడా అక్కరలేదు.

- ప్రొ.ముదిగొండ శివప్రసాద్