కృష్ణవంశీతో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రియేటివ్ జీనియస్‌గా టాలీవుడ్‌లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న కృష్ణవంశీ తదుపరి సినిమా కోసం సన్నాహాలు మొదలుపెట్టాడు. తాజాగా ఆయన రూపొందించిన ‘నక్షత్రం’ భారీ పరాజయం పాలవడంతో తదుపరి సినిమా ఏమిటనే సందేహాలు ఎక్కువయ్యాయి. ఈమధ్య వరుస పరాజయాలతో టెన్షన్‌లో వున్న కృష్ణవంశీకి తప్పకుండా ఓ హిట్ కావాలి. అందుకోసం మళ్లీ మరో సినిమాతో ప్రూవ్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈసారి ఆయన సినిమా చేసేది ఎవరితోనో తెలుసా? హీరో దగ్గుబాటి రానాతో! ఇప్పటికే రానాకు కథ చెప్పే ప్రయత్నాలు మొదలుపెట్టాడు కృష్ణవంశీ. ఇందులో మరో హీరో మాధవన్ కూడా నటిస్తున్నట్టు సమాచారం. తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని టాక్. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.