ఇదీ... ప్రేమకథే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మత్స్య క్రియేషన్స్, పిఎల్‌కె ప్రొడక్షన్స్ పతాకాలపై సంయుక్తంగా అయోధ్య కార్తీక్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఇది మా ప్రేమకథ’. యాంకర్ రవి, మేఘనా లోకేష్ జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 15న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా కథానాయకుడు రవి మాట్లాడుతూ- తన పరిచయ చిత్రం ప్రతిష్ఠాత్మకంగా ఉండాలని ప్రయత్నించానని, అనేకమంది సలహాలు తీసుకొని ఈ చిత్రంలో నటించానని తెలిపారు. ఖచ్చితంగా అందరికీ నచ్చే ఈ చిత్రం చక్కని కథాంశంతో రూపొందిందని, ఫీల్ గుడ్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమా తొలికాపీ ఎప్పుడో వచ్చినా, మంచి తేదీ కోసం ఎదురుచూశామని అన్నారు. అందరికీ నచ్చేలా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని, తనకు మంచి దర్శకుడిగా పేరు తెస్తుందని దర్శకుడు అయోధ్యా కార్తీక్ తెలిపారు. దర్శకుడు ఈ కథ చెప్పినపుడు ఈ సినిమా చేయగలడా లేదా అనుకున్నానని, బాగా తన ప్రతిభను చాటుకునేలా ఈ సినిమా రూపొందించాడని, విడుదలకు ముందే పాటలు అందరికీ నచ్చాయని, ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని నిర్మాత పి.ఎల్.కె.రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో గెటప్ శ్రీను, లోబో, ఫిల్మీ జంక్షన్ నందు తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.