‘ఇగో’ టీజర్ వచ్చేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశీష్‌రాజ్, సిమ్రాన్ జంటగా వి.కె.ఎ. ఫిలింస్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘ఇగో’ (ఇందు, గోపి). సుబ్రహ్మణ్యం.ఆర్.వి దర్శకత్వంలో విజయ్ కరణ్, కౌశల్‌కరణ్, అనీల్ కరణ్ సంయుక్తంగా రూపొందించారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ హైదరాబాద్‌లో మారుతి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- సినిమా ఎలా ఉండబోతోందో ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుందని, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని తెలిపారు. హీరో తెలుగువాడు కాకపోయినా తెలుగుదనంతో నటించాడని, హీరోయిన్ చక్కగా పాత్రలో ఒదిగిపోయిందని తెలిపారు. సినిమా అందరికీ నచ్చేలా రూపొందిందని, ఇగో లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారని నిర్మాతలు తెలిపారు.
ఆకతాయి సినిమాలో ప్రేక్షకులు తనను ప్రోత్సహించారని ఈ సినిమా కూడా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉందని ఆశీష్‌రాజ్ తెలిపారు. షూటింగ్ పూర్తయిన ఈ సినిమాకు సంబంధించిన కథను రెండు సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికీ చెబుతున్నానని, ఇగో ఫలితం విజయవంతమవుతుందన్న నమ్మకం వుందని దర్శకుడు సుబ్రహ్మణ్యం అన్నారు. కార్యక్రమంలో ఎడిటర్ శివ, అనిల్ కరణ్, తేజ, దిలీప్, సుభాష్, అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. దీక్షాపంత్, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, పృధ్వీ, అజయ్, షకలక శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్.జి. సంగీతం: సాయి కార్తీక్, దర్శకత్వం: సుబ్రహ్మణ్యం.ఆర్.వి.