ప్రేమాంజలి పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుజయ్, శ్వేతానీల్ జంటగా శ్రీ వినాయకా క్రియేషన్స్ పతాకంపై వరుణ్ దొరా దర్శకత్వంలో ఆర్.వి.నారాయణరావు రూపొందించిన చిత్రం ‘ప్రేమాంజలి’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఇటీవల విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ టీజర్ విడుదల చేయగా, మల్కాపురం శివకుమార్ బిగ్ సీడీ, ఆడియో సీడీని సాగర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ- పరిశ్రమకు కొత్త జనరేషన్ రావలసిన అవసరం వుందని, ఈ దర్శకుడు కూడా విశాఖపట్నం జిల్లానుండి వచ్చాడని, మంచి సందేశం వున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చూస్తే అతని డెడికేషన్ అర్థమైందని తెలిపారు. చిన్న సినిమాలు కొత్తకథలతో వస్తున్నాయి కనుక విజయవంతవౌతున్నాయని, చిన్నా పెద్దా తేడా లేకుండా మంచి కథనం వుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని, అలాంటి కథతో రూపొందిన ఈ సినిమా హిట్ అవుతుందని మల్కాపురం శివకుమార్ తెలిపారు. ఈ కథ ఫ్రెష్‌గా వుందని, తప్పక హిట్ అవుతుందని సాగర్ అన్నారు. 2016లో ఈ కథను అనుకున్నానని, చిన్న పిల్లలు ఏ అవకాహన లేకుండా ప్రేమలో పడి భవిష్యత్తు పాడుచేసుకుంటున్నారన్న వార్తలు చదివి ఈ కథ రాసుకున్నానని దర్శకుడు వరుణ్ దొర అన్నారు. మంచి మెసేజ్‌తో సాగే ఈ చిత్రం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో వుంటుందని, ప్రేమ అన్నది ఒక బాధ్యత అని ఈ చిత్రం ద్వారా చెబుతున్నామని అన్నారు. కార్యక్రమంలో గోవర్థన్, ఆకెళ్ల గోపాలకృష్ణ, కోటేశ్వరరావు, విద్యుత్ లక్కీ, రాజ్‌నజీర్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.