మరో ‘మెగా’ హీరో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుండి మరొక కథానాయకుడు త్వరలో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి మన తెలుగు చిత్ర పరిశ్రమలో రెండవ తరం కథానాయకుడు. చిరంజీవికి స్టార్‌డమ్ ఒక్క రోజుతోనో, ఒక నెలతోనో, ఒక్క సంవత్సరంతోనో, ఒక్క సినిమాతోనో, రెండు సినిమాలతోనో రాలేదు. ఎన్నో సాధక బాధకాలు.. ఒడిదుడుకుల తర్వాత వచ్చిన విషయం మన తెలుగు ప్రేక్షకులకు తెలుసు. చిరంజీవి తరువాత నాగబాబు, పవన్‌కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, వరుణ్‌తేజ్, సాయిధరమ్‌లకు బాటలు వేసిన వ్యక్తి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంనుంచి తొమ్మిదవ కథానాయకుడిగా చిరంజీవి రెండవ అల్లుడు కళ్యాణ్ జనవరిలో వెండితెరకు పరిచయమవుతున్నారు. కొత్తవారిని పరిచయం చేసే గొప్ప వ్యక్తిత్వం వున్నటువంటి వారాహి చలనచిత్ర అధినేత సాయి కొర్రపాటి కళ్యాణ్‌తో సినిమా చేయడానికి ముందుకు రావడం విశేషం. మామూలుగా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని కొత్తవారిని వెండితెరకు పరిచయం చేసిన నిర్మాత సాయి కొర్రపాటి, ఇక గొప్ప నటుని ఇంట్లోనుండి వస్తున్న మరొక నటునికి ఇంకెంత ప్రాముఖ్యాన్ని ఇస్తారో ఆలోచించాల్సిన అవసరమే లేదు. కానీ కళ్యాణ్‌కు చిన్నప్పటినుంచి నటించాలనే కోరిక బలంగా వుండడంవల్ల కళ్యాణ్ తన మామకు చెప్పగానే వైజాగ్‌లోని స్టార్‌లను వెండితెరకు పరిచయం చేసే స్టార్ మేకర్ సత్యానంద్ దగ్గర శిక్షణ ఇప్పించాడు. సత్యానంద్ చేతిలో మట్టిముద్దలాంటి మనిషి అపురూపమైన నటుడిగా తర్ఫీదు పొంది వెండితెరపై వెలిగిపోవాల్సిందే. గంగోత్రితో చిత్ర పరిశ్రమకు పరిచయమైన అల్లు అర్జున్ వరుసగా సినిమాల్లో హిట్లు కొట్టడంతో బన్నీకి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం కానీ, అవసరం గానీ రాలేదు. బన్నీ కూడా ఒక్క నటనలోనే కాకుండా కొరియోగ్రఫీ, స్టంట్స్‌లో తన ప్రతిభ చూపిస్తున్నాడు. ఇక అదే కోవలో రామ్‌చరణ్ కూడా తెరంగేట్రం చేసి తెలుగు సినీ ప్రపంచాన్ని, ప్రేక్షకుల్ని తన నటనతో ఉక్కిరి బిక్కిరి చేశాడు. తండ్రికి తగినట్లుగానే, అల్లు అర్జున్‌కు పోటీ అన్నట్లు డాన్స్, స్టంట్స్ వంటి విషయాల్లో వారెవ్వా అనిపించడం ఒక గొప్ప అనుభూతి. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ కూడా తన స్టామినాను రుజువు చేసుకుంటున్నాడు. సాయిధరమ్‌తేజ్ కూడా మంచి సినిమాలను చేస్తూ ప్రేక్షకాదరణ పొందుతున్నాడు. ఆ కళామతల్లి దీవెనలు ఉండడంవల్లనే ఇంతమంది నటులను మెగా ఫ్యామిలీ వెండితెరకు అందించింది.

- సుమశ్రీ