జిమ్‌తో లాభమే...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 17 February 2016
ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతోంది రకుల్‌ప్రీత్‌సింగ్. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ వరుస విజయాలు అందుకుంటున్న ఈ భామ, ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన సరైనోడు చిత్రంలో నటిస్తోంది.
ఇప్పటికే టాలీవుడ్‌పై ఎక్కువ దృష్టిపెట్టిన రకుల్, తాజాగా బిజినెస్ కూడా ప్రారంభించింది. అంతేకాదు, హైదరాబాద్‌లో సొంతంగా ఫ్లాట్ కూడా తీసుకుంది. ఇంతకీ రకుల్ పెట్టిన బిజినెస్ ఏంటో తెలుసా? ‘ఎఫ్-47’ పేరుతో లేటెస్టు టెక్నాలజీతో జిమ్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆమె జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్న ఫొటోలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మొత్తానికి రకుల్ ఓ వైపు హీరోయిన్‌గా నటిస్తూ, మరోవైపు బిజినెస్ ఉమెన్‌గా కూడా ప్రయత్నాలు సాగిస్తోంది మరి!