‘్భరతీయుడు-2’కు అనిరుధ్ సంగీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనిరుధ్.. ప్రస్తుతం సౌత్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. కొలవరి ఢీ సాంగ్‌తో ఒక్కసారిగా పాపులర్ అయిన ఈ కుర్ర సంగీత దర్శకుడు ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ నటిస్తున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రానికి సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన ఈ పాటలకు మంచి ఆదరణ లభిస్తోందన్న సంగతి తెలిసిందే. దీంతో అనిరుధ్ సంగీతానికి మరింత క్రేజ్ పెరిగింది. తాజాగా ఓ ప్రతిష్ఠాత్మక చిత్రానికి సంగీతం అందించే అవకాశం దక్కించుకున్నాడు అనిరుధ్. భారతీయుడు చిత్రం అప్పట్లో కమల్‌హాసన్-శంకర్ కలయికలో వచ్చి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘్భరతీయుడు -2’ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తున్నాడు శంకర్. ప్రస్తుతం రజనితో ‘రోబో-2.0’ సినిమా పూర్తయ్యింది. ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల తరువాత శంకర్ రూపొందించే చిత్రం ‘్భరతీయుడు-2’నే. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ పూర్తయిన ఈ చిత్రానికి రెహమానే సంగీతం అందించనున్నాడు. ఏమైందో కానీ రెహమాన్ బదులు అనిరుధ్ చేరాడు. అనిరుధ్ కెరీర్‌లో ఇదో గొప్ప అవకాశమని చెప్పక తప్పదు.