గ్లామర్‌తో గాలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా రంగంలో ప్రతి ఏడాది కొత్త కథానాయికలు వస్తూనే వుంటారు. కొందరు తమ ప్రతిభతో ఆకట్టుకుంటే, మరికొందరు గ్లామర్‌తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తుంటారు. లేలేత ముద్దుగుమ్మలు తమదై నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు కొందరికే సాధ్యమవుతాయి. ఇక మొదటి సినిమాతో ఆకట్టుకున్నామా, హీరోయిన్‌గా బ్రాండ్ పడ్డట్టే! ఇక్కడ కథానాయికల కొరత చాలానే వుంది అంటున్న సమయంలో చాలామంది లేలేత ముద్దుగుమ్మలు పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మరి ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే కొత్త అందాలు పరిచయమై గ్లామర్‌తో గాలం వేశాయి. వారిలో ఎవరెవరు ఎలా ఆకట్టుకున్నారో చూద్దాం!
తెలుగులో ఒక్క హిట్ కొట్టినా చాలు.. మరెన్నో అవకాశాలు ఈజీగా అందుకోవచ్చు అనే ఆలోచనతో వస్తున్నారు కొత్త కథానాయికలు. అలాంటివారి సంఖ్య బాగా పెరిగిపోవడంతో పోటీ కూడా తీవ్రంగానే వుంది. అయితే హిట్ పడకపోయినా ఫర్వాలేదు కానీ అందంతో, నటనతో అవకాశాలను అందుకోవాలని కొత్త భామలు సన్నాహాలు చేస్తున్నారు. క్రేజీ హీరోయిన్‌గా ఈ ఏడాది ఎక్కువ పేరు తెచ్చుకున్న భామ సాయి పల్లవి. ప్రేమమ్ మలయాళ సినిమాతో సౌత్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘్ఫదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఈ ఒక్క చిత్రంతోనే సాయి పల్లవికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పటికే ఈ అమ్మడికి తెలుగు, తమిళ భాషల్లో డజనుకుపైగా అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. సాయిపల్లవి తరువాత అదే రేంజ్‌లో కేవలం ఒక్క సినిమాతో కుర్ర హృదయాలను దోచేసింది షాలినీ పాండే. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్‌రెడ్డి సినిమాతో పరిచయం ఈ బెంగాలీ అందం సంచలనం రేపింది. హిందీలో సూపర్‌హిట్ అయిన ‘సాలా ఖద్దూస్’ సినిమాను తెలుగులో ‘గురు’పేరుతో వెంకటేష్ రీమేక్ చేశారు. ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రితికాసింగ్. గురు మంచి గుర్తింపు అందుకున్నా కూడా ఆమెకు ఆ తరువాత పెద్ద అవకాశాలు అందుకోలేదు. తమిళంలో లారెన్స్ సరసన ఓ చిత్రంలో మాత్రమే నటించింది.
తాజాగా వచ్చిన నివేదా పెతురాజ్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లిచూపులు సినిమా రూపొందించిన నిర్మాత ‘మెంటల్ మదిలో’ సినిమాను రూపొందించగా ఆ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ కోలీవుడ్ భామ అందరినీ ఆకట్టుకుంది. నితిన్ హీరోగా వచ్చిన ‘లై’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మేఘా ఆకాష్, తన గ్లామర్‌తో ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఆ సినిమా మాత్రం మేఘా ఆకాష్‌కు నిరాశనే మిగిల్చింది. అయినా అందం, దానికి తగ్గ గ్లామర్‌తో ఆకట్టుకున్న మేఘా ఆకాష్‌కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పటికే నితిన్ సరసన మరో సినిమా చేస్తుంది. దాంతోపాటు మరో రెండు సినిమాలను చేయడానికి సిద్ధమైంది. ఇక ఈ ఏడాది కూడా క్రేజీ దర్శకుడు పూరీ జగన్నాధ్ కొత్త హీరోయిన్లను టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. అయితే ఎవరూ నిలబడలేకపోయారు. ఫారిన్ అందం ఏంజెలా క్రిసిలెంజ్కి, ముస్కాన్ సేథి, కైరాదత్ లాంటి క్రేజీ భామలు ఆయన ద్వారానే తెలుగుతెరకు వచ్చినవారే. వీరితోపాటు స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ మంచి దూకుడుమీద వుంది. వరుస చిత్రాలతో బిజీగా వున్న రకుల్, అటు కోలీవుడ్‌లో కూడా వరుసగా చిత్రాలు చేస్తోంది. స్టార్ హీరోయిన్లు ఈ ఏడాది పెద్దగా విజయాలు సాధించినవారు లేరు. ఎందుకంటే నయనతార తమిళంలో తెచ్చుకున్నంత క్రేజ్ తెలుగులో తెచ్చుకోలేదు. తమిళ డబ్బింగ్ సినిమాలో ఆకట్టుకోలేకపోయింది. త్రిషకు ఈ ఏడాది పెద్దగా చిత్రాలు లేవు. బాలయ్య సరసన చేసిన గౌతమీపుత్రతో మంచి విజయాన్ని అందుకున్నా కూడా ఆ క్రేజ్ బాలయ్య కొట్టేశాడు. ఆ తరువాత శ్రీయకు పెద్దగా అవకాశాలు రాలేదు. రాశీఖన్నా ఎన్టీఆర్ సరసన నటించిన జై లవకుశ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది మలయాళ భామ నివేదా ధామస్‌కు కలిసి వచ్చింది. ఆమె నటించిన రెండు సినిమాలు విజయం అందుకోవడంతోపాటుగా మరింత క్రేజ్ పెంచుకుంది. తాప్సీకూడా ‘ఆనందోబ్రహ్మ’ అంటూ హారర్ చిత్రంలో నటించి తన వరుస ఫ్లాప్‌లకు బ్రేక్ వేసింది. ఈ ఏడాది చాలామంది కొత్త హీరోయిన్లు పరిచయం అయినా కూడా కొందరు ఎలాంటి క్రేజ్ లేకుండా ఎలా వచ్చారో అలాగే వెనక్కి వెళితే మరికొందరు మాత్రం తమదైన ఇమేజ్‌ను నిలబెట్టుకుని టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా మారారు.

-శ్రీ