మహేష్ విదేశీయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు ఒక సినిమా పూర్తిచేశాక కొన్ని రోజులు విదేశాలలో కుటుంబంతో కలిసి తిరగడం అందరికీ తెలిసిన సంగతే. తాజాగా మహేష్ మరోసారి ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
ఇటీవలే థమ్స్ అప్ యాడ్ కోసం విదేశాలకు వెళ్లొచ్చిన మహేష్‌బాబు, అక్కడ భరత్ అనే నేను షూటింగ్‌లో పాల్గొన్నాడు. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణతో ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. తదుపరి షెడ్యూల్ జనవరిలో మొదలుకానుంది. అందుకే మహేష్ తన కుటుంబంతో కలిసి విదేశీ ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. ఎలాగూ పిల్లలకు క్రిస్మస్ సెలవులు కనుక ఫ్యామిలీ మొత్తం శెలవులను ఆనందదాయకం చేసుకోవడానికి ఈ విదేశీ ప్రయాణాన్ని పెట్టుకున్నాడు. ఈసారి క్రిస్మస్‌తోపాటుగా కొత్త సంవత్సర వేడుకలు కూడా విదేశాల్లోనే జరుపుకోనున్నారు. జనవరి మొదటివారంలో సంక్రాంతి తరువాత షెడ్యూల్ ప్రారంభం కానున్నదట. ఏప్రిల్ 27న విడుదలకానున్న ఈ చిత్రంతోపాటు వంశీ పైడిపల్లి సినిమా మొదలు కూడా కానున్నదట.