పాపం.. ఇలియానా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ హీరోయిన్‌గా సౌత్‌లో ఓ రేంజ్‌లో ఇమేజ్ తెచ్చుకున్న బ్యూటీ ఇలియానా, బాలీవుడ్‌లో హీరోయిన్‌గా సెటిల్ అవ్వాలని తెలుగులో క్రేజీ అవకాశాలు వస్తున్నా కూడా వాటిని కాదని అక్కడ అడుగుపెట్టింది. మొదట రెండు మూడు అవకాశాలు వచ్చాయి కానీ హిట్ మాత్రం దక్కలేదు. దాంతో గ్లామర్ షోలు చేసింది.. రెచ్చిపోయి మరి హాట్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలోకి వదలింది. అయినా లాభం లేదు. కొత్త అవకాశాలైతే రాలేదు.. దాంతో కొన్నాళ్లుగా ప్రేమాయణంలో బిజీగా మారింది. ప్రియుడితో కలిసి తెగ షికార్లు చేసింది. ఇప్పుడు తనను జనాలు మరచిపోతున్నారని అనుకున్నట్టుంది.. మళ్లీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి సినిమాల్లోనే కాదు, మంచి పాత్రలు, ఛాలెంజింగ్ పాత్రలొస్తే బుల్లితెరపై కూడా నటిస్తానని చెబుతోంది. అంతేలే..! దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఇప్పుడు తెలిసి వచ్చినట్లుంది.