మరోసారి డాన్‌గా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ మరోసారి డాన్‌గా కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. అప్పట్లో అమితాబ్ నటించిన డాన్ సినిమాను షారుక్ రీమేక్ చేసి సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత కొన్నాళ్లకు మళ్లీ డాన్-2గా సీక్వెల్ చేశారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వలేదు. పర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇప్పుడు మరో సీక్వెల్ రూపొందించేందుకు సిద్ధం అయ్యాడు. తాజాగా షారుక్‌తో చర్చలు జరిపాడని, షారుక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి రానున్నదట. డాన్-3గా తెరకెక్కే ఈ సినిమా హాలీవుడ్ స్టైల్‌లో ఉంటుందట.