బాక్సర్‌గా అల్లు అర్జున్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమాలో నటిస్తున్నాడు. వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకుంది. ఏప్రిల్‌లో విడుదలకానున్న ఈ సినిమా తరువాత ఆయన నిర్మాతగా మారేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య స్టార్ హీరోలు నిర్మాతలుగా మారుతూ- భిన్నమైన సినిమాలు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి అల్లు అర్జున్ చేరాడు. ఓ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో అతనికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడానికి నిర్మాతగా మారుతున్నాడట. అన్నట్టు ఈ సినిమా ఓ బాక్సర్ కథతో ఉంటుందని, పూర్తి స్థాయి బాక్సర్ కథతో తెరకెక్కే ఈ సినిమా ఏప్రిల్‌లో సెట్స్‌పైకి రానుంది. ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.