నవ్వలేకపోతున్నా అతిథిరావు హైదరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న తారగా కెరీర్ ప్రారంభించిన అతిథిరావు హైదరీ ప్రస్తుతం బాలీవుడ్‌లో అగ్ర హీరోలతో నటించే స్థాయికి ఎదిగింది. చెలియా చిత్రంతో మెప్పించిన ఈ అమ్మడు తాజాగా సంజయ్ దత్ కుమార్తెగా భూమి చిత్రంలో నటించింది. అలాగే పద్మావతిలో ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. మణిరత్నం సినిమాలో నటించడం అన్నది ఒక కల అని, ఆ కల తీరినందుకు చాలా సంతోషంగా వుంటుందని చెప్పుకొచ్చింది. సంజయ్‌దత్ కలిసి నటించడం మరిచిపోలేని అనుభవమని, తనకు ఈ సినిమాలో కూతురుగా నటిస్తున్నాను కనుక పాలు తాగమని ప్రేమగా చెప్పేవారని, అలా ఆయన బిగ్ ఫ్రెండ్‌గా మారారని అంటోంది. అదీకాక భావోద్వేగమైన సన్నివేశాల్లో నటిస్తున్నపుడు ఆయన మేమెక్కడా అదే మూడ్‌లో వుండి బాధపడతామేమోనని జోకులు వేసి నవ్వించేవారని, అలా సన్నిహిత వాతావరణం వుండడంవల్లే షూటింగ్ పూర్తిచేశామని అంటోంది. తన లవ్ ఎఫైర్స్‌పై అనేక వివాదాలు వచ్చాయని, అయితే రూమర్లు వస్తూనే వుంటాయి కనుక నవ్వుకుంటూ వదిలేస్తానని అంటోంది. ఒకే నెలలో ఒకరికి పెళ్లి చెడగొట్టానని, వేరొకరితో చెట్టాపట్టాలేసుకుని తిరిగానని, మరొకరితో కలిసి వుండడం కోసం ఇల్లు వెతికానని, చివరకు మళ్లీ మాజీ ప్రియుడి దగ్గరకే వెళ్లానని రకరకాల రూమర్లు వస్తూనే వుంటాయని, వాటన్నింటిని వింటూ నవ్వుకుంటూనే వుంటాను కానీ మరేమీ చేయలేనని చెబుతోంది. విశేషం ఏమిటంటే, ఇన్ని రూమర్లు వచ్చినా ఆ నెలలో తాను ముంబైలోనే లేనని కొట్టిపారేసింది.