మళ్లీ రాజ్‌తరుణ్‌తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుమారి 21్ఫ’ లాంటి హిట్ చిత్రం అనంతరం ఆ చిత్ర దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్, కథానాయకుడు రాజ్‌తరుణ్‌ల క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవ్వనుంది. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా రామ్ తాళ్లూరి ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ‘కుమారి 21ఎఫ్’ తరహాలోనే లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో యువతను ఆకట్టుకొనే అంశాలన్నీ పుష్కలంగా ఉండడం విశేషం. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ- ‘‘హిట్ కాంబినేషన్ పల్నాటి సూర్యప్రతాప్- రాజ్‌తరుణ్‌ల కాంబినేషన్‌లో మా బ్యానర్‌లో సినిమా రూపొందించనుండడం ఆనందంగా ఉంది. సూర్యప్రతాప్ చెప్పిన కథ నచ్చింది. యువతరానికి నచ్చే ఎలిమెంట్స్ పుష్కలంగా వున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. ‘కుమారి 21్ఫ’ను మించిన స్థాయిలో ఈ సినిమా ఉండబోతోంది అన్నారు. రామ్ తాళ్లూరి ఇటీవల రవితేజ-కళ్యాణ్‌కృష్ణల కాంబినేషన్‌లో ఒక సెనే్సషన్ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు.