కొరటాల శివతో చరణ్ సినిమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న కొరటాల శివ సినిమా అంటే అటు ప్రేక్షకుల్లో ఎలాంటి ఆసక్తి వుందో.. ఆయనతో సినిమా చేసేందుకు టాలీవుడ్‌లో హీరోలు కూడా పోటీ పడుతున్నారు. వరుసగా మూడు సంచలన చిత్రాలు రూపొందించిన కొరటాల, ప్రస్తుతం మహేష్‌తో ‘్భరత్ అను నేను’ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా తరువాత కొరటాల మెగా హీరోతో సినిమాకు కమిట్ అయ్యాడు. ఆయన తదుపరి సినిమాలో నటించే మెగా హీరో ఎవరో తెలుసా.. ఇంకెవరు రామ్‌చరణ్? ఇప్పటికే వీరిద్దరిమధ్య కథా చర్చలు కూడా జరిగాయి. ఇప్పటికే చరణ్ కోసం ఓ సూపర్ కథను సిద్ధం చేశాడట కొరటాల శివ. ఈ సినిమాకు చరణ్ ఓకె చెప్పాడని తెలిసింది. ఇప్పటికే చరణ్ ‘రంగస్థలం’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత ఆయన నటించే సినిమా కొరటాలతోనే ఉంటుందట!