ఫీల్‌గుడ్ ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అఖిల్ ‘హలో’ చిత్రం విషయంలో దర్శకుడు విక్రం కుమార్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. తనతోపాటు టీమ్ కూడా ఎంతో కష్టపడి మంచి సినిమా తీశారు. అఖిల్‌కు మంచి హిట్ ఇవ్వాలనే కసితో చేసిన సినిమా ఇది. ఫలితం గూర్చి తన ఏ మాత్రం టెన్షన్ లేదు. రేపు అందరికీ నచ్చేస్తుంది’’ అన్నారు నాగార్జున. ‘హలో’ చిత్రం విడుదల సందర్భంగా ఆయన గురువారం విలేఖరులతో మాట్లాడుతూ- ‘‘మనం లాంటి చిత్రం తరువాత విక్రం కుమార్ అఖిల్ కోసం మంచి కథను ఎంచుకున్నాడు. అఖిల్ కూడా సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా డెస్టినీపై సాగుతుంది. ఫీల్‌గుడ్ ప్రేమకథ ఇది. దానితోపాటు చిన్న మాజిక్ కూడా వుంటుంది. ఈ సినిమాతో దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాం. తను చాలా చక్కగా చేసింది. చూడగానే ఇంప్రెస్ చేసేలా ఉంటుంది. నేను అఖిల్‌ను ఎలాగైతే చూడాలనుకున్నానో అలాంటి సినిమా ఇది. నిజానికి విక్రమ్‌తోనే అఖిల్ లాంఛింగ్ చేయాలనుకున్నాను. కానీ అప్పుడు తను వేరే కమిట్‌మెంట్‌తో ఉండడంతో కుదరలేదు. అందుకే ఈ సినిమా చేశాం. నేను హీరోగా నటిస్తూనే నిర్మాతగా బిజీగా వున్నాను. సినిమాలంటే నాకిష్టం. అఖిల్ సినిమా విషయంలో అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కవయింది. మనం అనుకున్న ప్రొడక్ట్ రావాలంటే ఖర్చుకు వెనుకాడకూడదు. తదుపరి విక్రమ్ దర్శకత్వంలో నాగచైతన్యతో సినిమా ఉంటుంది. అలాగే నేను, నాని కలిసి మరో సినిమా చేస్తున్నాం. ఈ సినిమా తరువాత అఖిల్ కోసం ఇంకా ఏ ప్రాజెక్టు ఖరారు కాలేదు. సినిమాను చూసిన చిరంజీవి బాగుందని అభినందించడమే కాకుండా అఖిల్‌ను అద్భుతంగా చేశామని పొగిడారు. అక్కినేని అభిమానులకు ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు.