అల్లరి నరేష్ మరో చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస పరాజయాలతో టెన్షన్‌మీదున్న అల్లరి నరేష్, ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మేడమీద అబ్బాయి’ పరాజయంతో మళ్లీ నిరాశనే మిగిల్చాడు. దాంతో సరైన విజయం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్న నరేష్, తనకు కెరీర్ బెస్ట్ హిట్ చిత్రాన్ని అందించిన భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే కథా చర్చలు జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమా తరువాత మరో చిత్రానికి కమిట్ అయ్యాడు నరేష్. ఇటీవలే సీనియర్ నరేష్ తనయుడిని పరిచయం చేస్తూ ‘నందిని నర్సింగ్‌హోమ్’ చిత్రాన్ని తెరకెక్కించిన గిరి దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందట. ఇప్పటికే గిరి చెప్పిన కథ నచ్చడంతో నరేష్ ఓకె చెప్పాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వస్తుందని సమాచారం. ప్రస్తుతం నరేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.