భయపెట్టే మోహిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్దకాలం పాటు దక్షిణాదిలో గ్లామర్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన త్రిషకు ఈమధ్య కెరీర్ బాగా వెనుకబడిపోయింది. ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ భామకు భిన్నమైన సినిమాలు చేసే అవకాశం వచ్చింది కానీ కమర్షియల్ విజయాలు అందనంద దూరంలో ఆగిపోయాయి. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తోంది. అయితే ఈ సినిమాలు కూడా విడుదల విషయంలో ఇంకా ఆలస్యం అవుతూనే వుంది. తాజాగా మరోసారి భయపెట్టేందుకు మోహినిగా వస్తున్న త్రిషకు కాస్త రిలాక్స్ ఇచ్చే అంశం ఏమిటంటే, చాలాకాలంగా వాయిదాపడుతూ వస్తున్న మోహిని చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా విడుదలైన టీజర్ సంచలనం సృష్టిస్తోంది. టీజర్‌లోనే భయపెట్టిన మోహిని అలియాస్ త్రిష ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది. మరి త్రిష నమ్మకాన్ని మోహిని ఎలా కాపాడుతుందో చూడాలి!