త్వరలో రంగస్థలం టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రంగస్థలం’. మార్చి 30న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇటీవలే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా మెగా అభిమానుల్లో భారీ అంచనాలు పెంచాయి. సుకుమార్ కూడా టీజర్‌తో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. సుకుమార్ స్టైల్‌లో టీజర్ ఉండబోతోందట. అయితే ఈ టీజర్ ఎప్పుడు వస్తుందో తెలుసా.. వచ్చే సంక్రాంతికేనట. అచ్చమైన పల్లెటూరి కథగా తెరకెక్కుతున్న రంగస్థలం చిత్రంలో రామ్‌చరణ్, సమంతల లుక్ కొత్తగా కనిపించనుందట. మైత్రి మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపుతోంది మరి.