28న ఒక్కక్షణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు శిరీష్, సురభి జంటగా వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో లక్ష్మీనరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్క క్షణం’. ఈ చిత్రం ఈనెల 28న విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్‌లకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలో రెండు పార్‌లాల్ లైఫ్‌లతో ముడిపడివుండే కథ. ఒకరిది ప్రెజెంట్, మరొకరిది ఫ్యూచర్ అనే తరహాలో సాగుతుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఎ సర్టిపికెట్ పొందింది. ఎక్కడికి పోతావు చిన్నవాడా తరువాత ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా వుంటుంది. అల్లు శిరీష్ కెరీర్‌లో భిన్నమైన చిత్రంగా నిలిచిపోతుంది. అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 28న భారీ స్థాయిలో విడుదల చేస్తున్నామన్నారు. ఈ చిత్రానికి సంగీతం:మణిశర్మ, కెమెరా:శ్యామ్ కె నాయుడు, ఎడిటింగ్:చోటా కె ప్రసాద్, నిర్మాత:చక్రి చిగురుపాటి, దర్శకత్వం:వి.ఐ.ఆనంద్.