జయాపజయాల దోబూచులాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రౌండప్ 2017
*
బాక్సాఫీస్ వద్ద విడుదలైన ప్రతి సినిమా సక్సెస్ కాలేదు. ఎన్నో ఆశలతో.. మరెన్నో ఆలోచనలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కొన్ని విజయాలు సాధిస్తే.. మరి కొన్ని అపజయాలను ఎదుర్కొంటాయ. 2017 సంవత్సరానికి సంబంధించి మనం ఆగస్టు వరకు వచ్చిన చిత్రాల గురించి విశే్లషించుకునాన్నం. ఇక సెప్టెంబర్ నెల గురించి పరిశీలిస్తే.. ఈ నెల ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ-పూరి జగన్నాధ్ కలయికలో వచ్చిన ‘పైసా వసూల్’ భారీ అంచనాలతో విడుదలైంది. ఏ మాత్రం ఆకట్టుకోని కథ.. బాలయ్య ఇమేజ్‌కి సరిపోకపోవడంతో ఈ సినిమాను తిప్పికొట్టారు జనాలు. పైసావసూల్.. టైటిల్‌లో వున్నట్టు వసూలు చేయలేకపోయింది. వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న అల్లరి నరేష్‌కి ‘మేడ మీద అబ్బాయి’ విజయాన్ని అందిస్తాడని ఊహించారు. కానీ అది ఊహగానే మిగిలిపోయింది. నరేష్‌కు సినిమా విజయం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇక సౌత్‌లో క్రేజీ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న మురుగదాస్ దర్శకత్వంలో, సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన ‘స్పైడర్’ భారీ అంచనాలమధ్య తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. కానీ స్పైడర్ సినిమా ఆశించిన ఫలితాన్ని మాత్రం రాబట్టుకోలేక ఫ్లాప్ ఉచ్చులో చిక్కుకుపోయింది. సునీల్ తన ఫ్లాప్‌లనుండి బయటపడేందుకు ‘ఉంగరాల రాంబాబు’గా చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజయం కోసం ఏ ఉంగరము పనిచేయలేదు. ఇక ఎన్టీఆర్.. జనతా గ్యారేజ్ తరువాత ఎలాంటి సినిమా చేయాలనే ఆలోచనలో కొంత గ్యాప్ తీసుకుని చేసిన ‘జై లవకుశ’ - ఏకంగా మూడు పాత్రల్లో ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రానికి కె.ఎస్.రవీంద్ర దర్శకత్వం వహించాడు. నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మించిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. నిజంగా ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఇదో భిన్నమైన ప్రయోగంగా నిలిచిపోయింది. ఈనెలలో వచ్చిన వెళ్లిపోమాకే, యుద్ధం శరణం, కధలో రాజకుమారుడు, గ్రేట్ రైటర్ విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ‘శ్రీవల్లి’, రొమాన్స్, సచిన్ జోషి ‘వీడెవడు’, శర్వానంద్ ‘మహానుభావుడు’ సినిమాల్లో వీడెవడు, మహానుభావుడు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుని నిలబడ్డాయి.
అక్టోబర్ నెలలో ‘లావణ్య విత్ లవ్ బాయ్స్’ సినిమాతో నెల మొదలైంది. ఈ లావణ్య ప్రేక్షకులను తన ప్రేమతో ఆకట్టుకోలేదు. ఆ తరువాత విడుదలైన బావామరదలు, నేను కిడ్నాప్ అయ్యాను, ఓయ్ నినే్న, గల్ఫ్, యువర్స్ లవింగ్లీ, అనగనగా ఒక దుర్గ, ద్యావుడా సినిమాలు అంతంతమాత్రంగానే నిలిచాయి. ఇక ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున మొదటిసారి హారర్ సినిమాలో నటించాడు ‘రాజుగారి గది-2’ పేరుతో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సమంత కీ రోల్‌లో ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇందుకుముందే సక్సెస్ అయిన ‘రాజుగారి గది’ సినిమాకు సీక్వెల్. ఇదే నెలలో రవితేజ కొంత గ్యాప్ తీసుకుని రవితేజ అంధుడి పాత్రల నటించిన చిత్రం ‘రాజా ది గ్రేట్’. వరుస పరాజయాలతో కాస్త డీలాపడిన రవితేజకు ఈ రాజా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం హిట్‌గా నిల్చింది. ఇక నేను శైలజ లాంటి ఘనవిజయం తరువాత హీరో రామ్-కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’ భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా మిగిలిపోయింది. నవంబర్ నెలలో పలు చిత్రాలు గట్టి పోటీకి నిలబడ్డాయి. కుమారి 21ఎఫ్‌తో సంచలనం రేపిన హెబ్బా పటేల్, నాగ అనే్వష్ నటించిన చిత్రం ‘ఏంజెల్’, భారీ గ్రాఫిక్స్‌తో బాహుబలి పళని తెరకెక్కించిన ఈ సినిమాలోని ఏంజెల్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక టీవీ నటుడు ప్రభాకర్ దర్శకత్వంలో హీరో ఆది నటించిన హారర్ సినిమా ‘నెక్స్ట్ నువ్వే’ గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ వంటి ప్రతిష్ఠాత్మక బ్యానర్స్ నిర్మించిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. యాంగ్రీ యంగ్‌మెన్ రాజశేఖర్ కొంత గ్యాప్ తరువాత నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ పిఎస్‌వి గరుడవేగ సరికొత్త సబ్జెక్టుతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని రాజశేఖర్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు భారీ విజయాన్ని కట్టబెట్టారు ప్రేక్షకులు. ఇక గోపీచంద్ హీరోగా వచ్చిన ‘ఆక్సిజన్’ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా చాలాసార్లు విడుదల వాయిదా పడడంతో సినిమాకున్న క్రేజ్ తగ్గింది. మంచు మనోజ్ నటించిన ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాకు ప్రశంసలు తప్ప సక్సెస్ దక్కలేదు. సందీప్‌కిషన్ ‘కేరాఫ్ సూర్య’ యావరేజ్‌గా నిలిచింది. లండన్‌బాబులు, లవర్స్‌క్లబ్, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, ప్రేమతో మీ కార్తిక్, స్నేహమేరా జీవితం, బేబీ, నారా రోహిత్ ‘బాలకృష్ణుడు’, దేవిశ్రీప్రసాద్, జంధ్యాల రాసిన ప్రేమకథ, జూన్ 143 వంటి సినిమాలు షరా మామూలే. వచ్చిన సంగతి వెళ్లిన సంగతి ఎవరికీ తెలియదు. ఇక గత ఏడాది పెళ్లిచూపులు వంటి సంచలన విజయాన్ని అందుకున్న నిర్మాత రాజ్ కందుకూరి మరో కొత్త దర్శకుడితో చేసిన ప్రయత్నం ‘మెంటల్ మదిలో’ భారీ అంచనాలమధ్య విడుదలైన ఈ సినిమా హిట్‌గా నిలిచింది.
ఈ ఏడాది చివరి నెలలో ఎక్కువ సినిమాలే విడుదలయ్యాయి. డిసెంబర్ నెలలో చూసుకుంటే సాయిధరమ్ హీరోగా బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో వచ్చిన ‘జవాన్’ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక కమెడియన్ సప్తగిరి ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’గా హిందీ రీమేక్‌తో వచ్చాడు. సినిమాలోని కథను పక్కదోవ పట్టించిన ఈ ఎల్‌ఎల్‌బి విజయం అందని ద్రాక్షగా మిగిలింది. సుమంత్ హీరోగా కొంత గ్యాప్ తరువాత నటించిన ‘మళ్లీ రావా’ హిట్ సినిమాగా నిలవగా, ప్రేమిక, బిటెక్ బాబులు, వానవిల్లు, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, యాంకర్ రవి హీరోగా వచ్చిన ‘ఇది మా
ప్రేమకథ’, జూలియన్ లవర్ ఆఫ్ ఇడియెట్, కుటుంబ కథా చిత్రమ్, లచ్చి, పడిపోయా నీ మాయలో, సీత రాము
నికోసం, తొలి పరిచయం, ఇఈ, ఉందా లేదా వంటి సినిమాలు ఏ మాత్రం ఆకట్టుకునే ప్రయ త్నం చేయలేదు. ఇక నాచురల్ స్టార్ నాని ఈసారి ఎంసిఏతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమా భారీ ఓపెనింగ్ రాబట్టింది. ఇక అక్కినేని మరో వారసుడు అఖిల్ హీరోగా విక్రం కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘హలో’ సినిమా ఇటీవలే విడుదలై మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మరో రెండు రోజులు దాటితేగానీ ఈ సినిమాల పరిస్థితి చెప్పలేం. మొత్తానికి ఈ ఏడాది అటు విజయాలు.. ఇటు పరాజయాలతో సాగినా కొత్త కథలు.. సంచలన సినిమాలతో ఆశాజనకంగా సాగిందని చెప్పక తప్పదు.

- శ్రీ