సక్సెస్‌ల వెనుక ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1977లో ‘పెళ్లిపందిరి’ చిత్రంతో డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్‌సాధిచిన దిల్‌రాజు.. 2002లో ‘దిల్’ చిత్రంతో నిర్మాతగా సక్సెస్‌ను సాధించాడు. ఒక పక్క నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా రాణిస్తున్న దిల్‌రాజు 2017లో తన వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఆరు విజయవంతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించి డబుల్ హ్యాట్రిక్ నిర్మాత అయ్యాడు. ఈ సందర్భంగా జరిగిన శ్రీ వెంటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఈ ఏడాది విడుదలైన సక్సెస్‌ఫుల్ మూవీస్ శతమానంభవతి, నేను లోకల్, డీజే దువ్వాడ జగన్నాథమ్, ఫిదా, రాజా ది గ్రేట్, ఎంసిఏ చిత్రాల్లోని హీరోలు, దర్శకులను నిర్మాణ సంస్థ నుండి దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్‌లు సత్కరించారు. అలాగే దిల్‌రాజు డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్ జర్నీని స్టార్ట్ చేసిన పెళ్లిపందిరి సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ, హీరో జగపతిబాబు సహా యూనిట్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, వరుణ్ తేజ్, నాని, దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్, జయసుధ, భూమిక, అనుపమ పరమేశ్వరన్, మెహరీన్, దేవిశ్రీ ప్రసాద్, శేఖర్ కమ్ముల, బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ- ఇది ఒక సినిమాకు సంబంధించిన ఈవెంట్ కాదు, ఆరు సినిమాలకు సంబంధించిన ఈవెంట్. ఒక నిర్మాత ఓ ఏడాదిలో ఆరు సినిమాలు చేసి... ఆరు బ్లాక్‌బస్టర్స్ కావడం అనేది ఒక్క దిల్‌రాజుకే సాధ్యమైంది. ఈ బ్యానర్‌లో రెండో సినిమా నాదే. అలాగే 27వ సినిమా కూడా నేనే చేశా. విజయవంతంగా 27 సినిమాలు ఈ సంస్థ పూర్తిచేసుకోవడం ఆనందాన్నిస్తోంది అని తెలిపారు. ఒక్క ఏడాదిలో ఇన్ని సినిమాలు చేయడం మామూలు విషయం కాదు- అదీ విజయవంతమైన చిత్రాలు చేయడం అసలు జరగని విషయం. ఇలాంటి విజయాలు అందుకోవడానికి వెనుక నా జీవితంలో అనేకమంది ఉన్నారు అని నిర్మాత దిల్‌రాజు అన్నారు. 1987 డిసెంబర్‌లో మొదలైన నా జీవితం ఈ సంవత్సరానికి ఏదో లింక్ వున్నట్లు అన్పిస్తోంది. సినిమాలమీద ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చి ఈ 20 ఏళ్ళల్లో మంచి చిత్రాలను అందించడానికి ఎంతో కష్టపడ్డాం. ఆ విషయాలన్నీ మా కుటుంబానికి తెలుసు. మూడు లక్షలకోసం అనేక షాపులు చుట్టూ తిరిగిన రోజులు గుర్తున్నాయి. 5వేల కోసం కూడా అనేక చోట్ల వెతికిన సంగతులు మాకున్నాయి. ఎంతో అనుభవంతో పాటు అనేక విషయాలు నేర్చుకున్నాం. చాలామంది దర్శకుల్ని పరిచయం చేశాం. ఈ సంవత్సరం సంస్థకు రెండు హ్యాట్రిక్‌లు వస్తాయని అని ఆయన వివరించారు. భగవంతుడు ఇలా డిజైన్ చేస్తే మంచి కుటుంబ సభ్యులు, స్నేహితులు ముందుకు తీసుకువెళ్లారు అని ఆయన తెలిపారు