మరో పదేళ్ళు హీరోయిన్‌గానే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటికే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి పదేళ్ళయింది. మరో పదేళ్ళపాటు హీరోయిన్‌గా కొనసాగుతా అని తెగ కాన్ఫిడెంట్‌గా చెబుతుంది తెలుగు భామ అంజలి. పుట్టింది ఆంధ్రాలో అయినా తమిళ జనాలను తెగ ఇంప్రెస్ చేసిన ఈ తెలుగు పాప నటిగా మంచి మార్కులు కొట్టేసింది. తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న అంజలి సీనియర్ హీరోలతోపాటు యువ హీరోలతో నటించింది. ప్రస్తుతం హర్రర్ నేపథ్యంలో రూపొందుతున్న ‘బెలూన్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో మంచి హిట్ అందుకుంటా అంటూ తెగ కామెంట్ చేస్తున్న ఈ భామ ఇంతకుముందు గీతాంజలి, చిత్రాంగద వంటి హర్రర్ సినిమాల్లో నటించింది. తాజాగా బెలూన్ ప్రమోషన్‌లో పాల్గొన్న ఈ భామ స్పందిస్తూ... హీరోయిన్‌గా పదేళ్లు గడిచిపోయింది. మరో పదేళ్ళు హీరోయిన్‌గా కొనసాగుతా అంటూ కాన్ఫిడెంట్‌గా చెప్పింది.
ఇప్పటికే జైతోప్రేమాయణం సాగిస్తున్న ఈ భామ పెళ్లి విషయాన్ని పక్కన పెట్టిందా ఏమిటి? అన్న సందేహాలు ఎక్కువయ్యాయి.