కోలీవుడ్ దర్శకుడితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి సినిమాతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్‌పై ఇపుడు అందరి కన్ను పడిందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కోలీవుడ్- బాలీవుడ్ మీడియాలలో ఇపుడు ప్రభాస్ గురించి ప్రత్యేక కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా తమిళ ప్రేక్షకుల మధ్యలో ఇపుడు ఒక న్యూస్ హాట్ టాపిక్ అయింది. అదేమిటంటే తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ప్రభాస్‌తో ఓ సినిమాను చేయాలని అనుకుంటున్నాడట. త్వరలో ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్ళే ఛాన్స్ వుందని కోలీవుడ్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు. ఇటీవల మెర్సల్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అట్లీ. ఈ స్టార్ డైరెక్టర్‌కి ప్రస్తుతం మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ అతను మాత్రం ప్రభాస్‌తో సోషల్ మెసేజ్ వున్న ఒక సినిమాను చేయాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నాయట. త్వరలో ప్రభాస్‌ని కలిసి సినిమా కథను చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమాతో బిజీగా వున్న సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది.