కుటుంబం చుట్టే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా కథలన్నీ కుటుంబాలకు సంబంధించిన అంశాలతోనే నిండి వుంటాయి. అలా రాసుకోవడమే నాకు ఇష్టం అంటున్నారు ‘ఎంసిఏ’ దర్శకుడు శ్రీరామ్ వేణు. నాని, సాయిపల్లవి జంటగా ఆయన దర్శకత్వంలో దర్శకత్వంలో విడుదలైన చిత్రం ‘ఎంసిఏ’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సందర్భంగా శ్రీరామ్ వేణు మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు వస్తున్న ఆదరణకు చాలా ఆనందంగా వుంది. సినిమా గురించి ఏదైతే అనుకున్నామో అదే ఇప్పుడు జరుగుతుంది. కథ అనుకున్నపుడు నాని అయితేనే బెటర్ అనిపించింది. మిడిల్ క్లాస్ అబ్బాయిగా నానిని తప్ప వేరేవారిని ఊహించలేం. ఆయన కూడా బాగా నటించారు. ఈ కథను నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలతో అల్లుకున్నా. నాకో తమ్ముడు ఉన్నాడు. నా పెళ్లి తరువాత అతనికి ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చింది. ఇది బాగుందన్న ఆలోచనతో చేసిన కథ ఇది. సాయిపల్లవి కూడా తన పాత్రలో ఇమిడిపోయి నటించింది. హీరోతో పోటీగా చేసింది. సినిమా విషయంలో మా టీమ్ ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. నిర్మాత రాజు ప్రతి విషయంలో వెన్నంటి వుండడంవల్లే ఈ సినిమా చేయగలిగాం. మొదటి సినిమాగా ఇదే బ్యానర్‌లో ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రం చేశా. కొన్ని కాలిక్యులేషన్స్‌వల్ల ఆ సినిమా విజయవంతం కాలేదు. ఆ తరువాత ఐదేళ్లకు మళ్లీ ఈ చిత్రాన్ని చేశా. ఈ గ్యాప్‌లో రెండు ప్రాజెక్టులు ఫైనల్ దశకు వచ్చి షూటింగ్ కాకుండా ఆగిపోయాయి. అలా మూడేళ్లు టైమ్ వృథా అయింది. ఏది మంచి ఏది చెడు అన్నది ఈ గ్యాప్‌లో తెలుసుకోగలిగా. సినిమాలు ఎక్కువగా చూశా. ప్రతి చిత్రం నన్ను ప్రభావితం చేసింది. ప్రస్తుతం కథలైతే ఉన్నాయి. తరువాతి చిత్రం కూడా రాజు బ్యానర్‌లోనే చేస్తాను’’ అంటూ ముగించారు.