మార్చినుండి థియేటర్లు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో డిజిటల్ మరియు థియేటర్ల లీజ్ విధానంపై మార్చి 31లోపు డిజిటల్ రేట్లు తగ్గించకున్నా, థియేటర్ల లీజు విధానం తీసివేయకపోయినా ఆ రోజునుండి రెండు రాష్ట్రాలలో సినిమాలు మరియు థియేటర్లు, షూటింగ్‌లు బంద్ చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ మరియు సభ్యులు తెలుగు ఫిలిం ఛాంబర్ తెలియజేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాం ఫిలిం ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్, సాయి వెంకట్, అలీఖాన్ పాల్గొని విశేషాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ- తాము పరిశ్రమలో సమస్యలపై గత 15 సంవత్సరాలుగా పోరాడుతున్నామని, చాలాకాలం నుంచి డిజిటల్ విధానం మరియు రెంటల్ విధానంపైన పోరాటం సాగిస్తున్నామని అన్నారు. పక్క రాష్ట్రాల్లో వున్న విధానం మనకు రావాలని, తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ ఛార్జీలు ఒక వారానికి 13 వేల రూపాయలు వసూలు చేస్తున్నారని, తమిళనాడు, కర్ణాటక, మహారాష్టల్ల్రో వారానికి 2,500 మాత్రమే వసూలు చేస్తున్నారని ఆయన వివరించారు. ఈ రేటు మన రెండు రాష్ట్రాలకు కూడా కావాలని, చిన్న సినిమాలకు అదనంగా తీసుకునే 50వేల రూపాయల డిపాజిట్ కూడా నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సెన్సార్ పూర్తిచేసుకున్న 300 చిత్రాలు విడుదలకు నోచుకోలేదని, ఈ పరిస్థితి కారణం మన తెలుగు పరిశ్రమలో వుండే ముగ్గురు నలుగురు నిర్మాతలేనని ఆయన అన్నారు. నలుగురు కలిసి కొన్ని వేలమంది నిర్మాతల డిస్ట్రిబ్యూటర్ల రక్తం తాగుతున్నారని ఆయన విచారం వ్యక్తంచేశారు. ఈ విధానం మారకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, రెండు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లనుండి మంచి స్పందన లభిస్తోందని ఆయన అన్నారు. ప్రతి మీటింగ్‌లో ఈ సమస్యల గురించి మాట్లాడుతూనే వున్నామని, ఇప్పటికైనా మేలుకొని తెలుగు ఫిలిం ఛాంబర్ సమస్యలపై నిర్ణయం తీసుకోవడం హర్షదాయకమని తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ అలీఖాన్ తెలిపారు.