‘రాజరథం’ ట్రైలర్ వచ్చేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరూప్ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘రాజరథం’. షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. జనవరి 25న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో దగ్గుబాటి రాణా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో నిరూప్ భండారి మాట్లాడుతూ- సినిమా అందరికీ నచ్చే విధంగా రూపొందిందని, దర్శకత్వం, సంగీతం అన్నయ్య చేస్తే, వదిన కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారని, ఈ చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా వుందని తెలిపారు. హైటెక్నికల్ విలువలతో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు అనూప్ భండారి తెలిపారు. అనూప్ భండారి రూపొందించిన ‘రంగి తరంగ’ కన్నడ చిత్రం అనేక అవార్డులను గెలుచుకుందని, ఈ సినిమాలో తాను కనిపించకుండా వినిపిస్తానని నటుడు రానా తెలిపారు. హద్దులను చెరిపేసే కథలలో రాజరథం ఒకటని, విలక్షణమైన కథతో రూపొందిన ఈ సినిమా తప్పక విజయవంతం కావాలని ఆయన కోరుకున్నారు. కార్యక్రమంలో సతీష్ శాస్ర్తీ, అవంతిక శెట్టి, రామజోగయ్య శాస్ర్తీ, అబ్బూరి రవి తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.