‘హలో’తో కొత్త ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌కు మొదటి సినిమా ‘అఖిల్’ పరాజయాన్ని అందించినా రెట్టించిన ఉత్సాహంతో కొంత గ్యాప్ తీసుకుని ‘హలో!’ అంటూ పలకరించాడు. ‘మనం’ ఫేం విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ విజయపథం వైపు దూసుకెళుతోంది. ఈ సందర్భంగా అఖిల్‌తో ఇంటర్వ్యూ..
‘హలో’ విజయం..
ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా వుంది. అందరూ నటుడిగా ఇంప్రూవ్ అయ్యారని అంటున్నారు. సినిమా విడుదలకు ముందు చాలా టెన్షన్ పడ్డాను. సరిగా నిద్ర కూడా పోలేదు. అయితే విడుదల రోజు అమెరికా నుండి సినిమా బాగుందంటూ కాల్ రావడంతో చాలా ఆనందం వేసింది. ఆ రోజు చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. ఈ సినిమా నాకు ఉద్వేగభరిత ప్రయాణం అని చెప్పాలి. ఈ చిత్రం క్లైమాక్స్‌లో నేను తన గుండెను దొంగిలించానని ఓ అమ్మాయి ట్విట్టర్‌లో రాసింది. నాకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే! అలాగే నాన్న, అమ్మ, చైతన్య, ముఖ్యంగా చిరంజీవి గారు ఇచ్చిన సపోర్టు మరువలేను.
మొదటి సినిమా
హీరోగా నేను పరిచయం అయిన మొదటి సినిమా భారీ అంచనాల మధ్య వచ్చింది. కానీ అది అనుకున్న స్థాయిలో విజయం అందుకోలేదు. దానికి చాలా కారణాలున్నాయి. ఆ సినిమా తరువాత బాగా టెన్షన్ పడ్డాను. వ్యక్తిగత సంక్షోభం వల్ల మళ్లీ మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పట్టింది. తరువాతి సినిమా విషయంలో చాలా కథలు విన్నా. ‘మనం’ సమయంలోనే విక్రంతో ఈ సినిమాకు నాన్న ప్లాన్ చేశారు. కానీ విక్రం ‘24’చిత్రంతో బిజీగా వుండడంతో అప్పుడు కుదరలేదు.
ప్రాక్టీస్ చేశా
ఈ చిత్రంలో కొన్ని స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయి. వాటికోసం రెండు నెలలు ట్రైనింగ్ తీసుకున్నా. బాబ్‌బ్రౌన్ నేతృత్వం లో వున్న టీమ్‌తో దాదాపు మూడు నెలలు ట్రావెల్ చేశా. అందుకే ఆ యాక్షన్ సీక్వెన్స్ బాగా వచ్చాయి. ఈ చిత్రంలో ఓ పాట కూడా పాడా. అందుకు కారణం సంగీత దర్శకుడు అనూప్. తను కూడా పాట విషయంలో ట్రైనింగ్ ఇచ్చాడు. నిజానికి నేను పాడతానని అనుకోలేదు. అనూప్ ప్రోత్సాహంవల్లే అది కుదిరింది.
నాన్న కేర్ ఎక్కువ..
ఈ సినిమా విషయంలో నాన్న కేర్ ఎక్కువ. స్క్రిప్ట్ నుండి పోస్ట్ ప్రొడక్షన్ దశ వరకు ప్రతి విభాగంలోనూ ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. నా మొదటి సినిమాలా భావించి అంత జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టే ఈ విజయం అందింది. ఇక ‘అఖిల్’ సినిమా విషయంలో ఫ్లాప్ అవ్వడానికి కారణం నేనే అని చెబుతా. వినాయక్‌తో కలిసి ఈ కథను నమ్మాం. కానీ అనుకోకుండా పరిస్థితి వేరేలా మారింది.
తదుపరి చిత్రాలు
తరువాతి చిత్రం కోసం ఎక్కువ సమయం తీసుకోను. ప్రస్తుతం బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తారా? అని అడుగుతున్నారు. తెలుగులో ఐదారు హిట్స్ ఇవ్వాలి. ఆ తరువాతే హిందీ సినిమా. నేను హిందీ సినిమాలు చూస్తా. నా అభిమాన దర్శకుడు అయాన్ ముఖర్జీ. హి జవానీ హాయ్ దివాని లాంటి చిత్రాలు చేయాలని వుంది. అయితే రెండు భాషల్లో కలిపి ఓ సినిమా చేస్తా తప్ప, పూర్తి హిందీ సినిమా చేయను. మొదటి ప్రాధాన్యత తెలుగు సినిమాలకే!

- శ్రీ