కృష్ణార్జున యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ నుండి తాజాగా విడుదలైన ‘ఎంసీఏ’ వరకు ఎనిమిది వరుస విజయవంతమైన చిత్రాలతో మెప్పిస్తున్న యువ నటుడు నాని హీరోగా ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. వెంకట్ బోయినపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహసు గారపటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్‌రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మీర్ ఈ చిత్రంలో నాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా రెండు షెడ్యూల్స్ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. ఇందులో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 12న గ్రాండ్ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతాన్ని అందిస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.