శర్వానంద్‌కు జోడీగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శర్వానంద్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై చుక్కపల్లి ప్రసాద్, సుధాకర్ చెరుకూరి ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జనవరి 3వ వారం నుండి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- దర్శకుడు ఓ మంచి కథను సిద్ధం చేశాడని, శర్వానంద్, సాయిపల్లవిల జంట వైవిధ్యంగా వుంటుందని తెలిపారు. హిలేరియస్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రం యూత్‌తోపాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.