సుధీర్‌బాబు ‘సమ్మోహనం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుధీర్‌బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఇటీవల ఓ చిత్రం ప్రారంభం అయింది. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాత. అతిదిరావు హైదరీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘సమ్మోహనం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అనూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు. శమంతకమణి సినిమా తరువాత సుధీర్‌బాబు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ హీరో నటించిన ‘వీరభోగ వసంతరాయలు’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.