పాట చిత్రీకరణలో ‘నేనే సరోజ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిల్మీడియా ప్రొడక్షన్స్ ప్రై.లి. పతాకంపై అల్లాణి శ్రీ్ధర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘నేనే సరోజ’. ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. ఇబ్రహీంపట్నం చింతపల్లి గూడలో చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ జరుపుతున్నారు. కథానాయిక మేఘన మరికొందరు జూనియర్ ఆర్టిస్టులతో రూపొందిస్తున్న ఈ పాట గురించి దర్శకుడు అల్లాణి శ్రీ్ధర్ మాట్లాడుతూ- పది రోజులపాటు జరిగే ఈ షెడ్యూల్‌లో ఈ టైటిల్ సాంగ్‌తోపాటుగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నామని, కాలేజీ విద్యార్థుల జీవితాలకు దగ్గరగా ఈ పాట ఉంటుందని తెలిపారు. ఆడపిల్ల అంటే మైనస్ అనే మాటను తాను ఒప్పుకోనని, అలాంటప్పుడు ఆ పిల్ల సమాజంలో ఎలా జీవించాలని, అందుకే ఆమెకు ధైర్యం, ఆత్మస్థైర్యం కావాలనే విధంగా ఈ పాట రాశానని పాటల రచయిత సదానంద శారద అన్నారు. గ్రామీణ యువతి నగరానికి వచ్చి జీవితంతో పోరాడి తాను అనుకున్నది ఎలా సాధించింది అన్నదే ఈ సినిమా ప్రధానాంశమని వారు తెలిపారు. రమ్యానాయుడు, వరంగల్ సుధాకర్, శ్రీహర్ష, బొమ్మలాట సారిక, వింజమూరి మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రమేష్ ముక్కెర, కెమెరా:్ధన జి.బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అల్లాణి శ్రీ్ధర్.