పెళ్లయితే అంతేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్..దాదాపు హాలీవుడ్ స్థాయికి చేరుకుంటుంది. అక్కడ అరవై ఏళ్లకు కూడా హీరోయిన్లుగా నటిస్తారు. హిందీలో కూడా వుంది. తెలుగులో మాత్రం పెళ్లయిందంటే కెరీర్ అయిపోయిందనే అంటారు. ఈ మైండ్‌సెట్ మారాలి అంటారు నటి భూమిక. నాని కథానాయకుడిగా రూపొందించిన ఎంసిఏ చిత్రంలో నటి భూమిక వదినగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని భూమిక పలు విశేషాలు తెలిపారు. ‘‘మిడిల్ క్లాస్ అబ్బాయికి వదినగా నటించడం బాగుంది. మూడేళ్ల తర్వాత తెలుగు సినిమా చేయడం సంతోషాన్నిచ్చింది. చూసినవారంతా పాజిటవ్‌గా వుందని మెచ్చుకున్నారు. కొత్త తరహా సినిమాలు చేయాలని నా కోరిక. అలా అవకాశం వస్తే హీరోయిన్‌గా చేస్తా. మిస్సమ్మ, అనసూయ చిత్రాలు నటిగా సంతృప్తినిచ్చాయి. నేను చేసిన పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవడం అంటే చాలా ఇష్టం. సవ్యసాచి చిత్రంలో నేనే డబ్బింగ్ చెప్పాలనుకుంటున్నా. ఏవౌతుందో చూడాలి. హిందీలో ‘కామోషి’ చిత్రం త్వరలో విడుదల కానున్నది. అదొక థ్రిల్లర్. ప్రస్తుతం తెలుగులో సవ్యసాచి మాత్రమే చేస్తున్నా.