టాలీవుడ్ బెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోయింది సొట్టబుగ్గల తాప్సీ. ఎన్ని సినిమాల్లో నటించినా కూడా సరైన కమర్షియల్ హిట్ మాత్రం దక్కలేదు. దాంతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముంబై చెక్కేసింది. నామ్ షబానా, పింక్ వంటి చిత్రాలతో నటిగా ఇమేజ్ తెచ్చుకున్న తాప్సీకి గ్లామర్ హీరోయిన్‌గా మారాలన్న కోరిక మాత్రం నెరవేరలేదు. దాంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అక్కడ అన్నీ పింక్ లాంటి కథలే వస్తున్నాయట. దాంతో మళ్లీ టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. ఇక్కడ సక్సెస్ విషయం పక్కనబెడితే, తనను గ్లామర్ హీరోయిన్‌గానే చూశారని, తనకు అలాంటి అవకాశాలే వచ్చాయని, అందుకే మళ్లీ తెలుగులో నటించేందుకు సిద్ధమవుతోంది. మరి ఈసారైనా ఆమె ఆశించిన సక్సెస్ వస్తుందేమో చూడాలి.