మనసుకు నచ్చితే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మహేష్‌బాబు సోదరి మంజుల దర్శకురాలిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మనసుకు నచ్చింది’. సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిధా చౌదరి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంజయ్ స్వరూప్, పి.కిరణ్ నిర్మిస్తున్నారు. సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఈ సినిమా ట్రైలర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ‘ట్రైలర్‌కి విశేషమైన స్పందన లభిస్తోంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం వుంది. ఇటీవలే విడుదలైన పాటలకు కూడా అనూహ్యమైన స్పందన వస్తోంది. త్వరలోనే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి రిలీజ్ ఈవెంట్‌ను కూడా త్వరలో నిర్వహిస్తాం. ఈ నెల 26న చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు. ప్రియదర్శి, పునర్నవి భూపాలం, నాజర్, అరుణ్ అదిత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.