విజయకృష్ణ పేరుతో ట్రస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ నరేష్ పుట్టినరోజు వేడుకలు శనివారం హైదరాబాద్‌లోని నానాక్‌రామగూడలోని కృష్ణ నివాసంలో అభిమానులు, ‘మా’ సభ్యుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల, నవీన్ కృష్ణ, మురళీమోహన్, మా ప్రెసిడెంట్ శివాజీ రాజా, ‘శతమానంభవతి’ దర్శకుడు సతీష్ వేగేశ్న, నిర్మాత దిల్‌రాజు, నటుడు ప్రదీప్, ఇతర నిర్మాతలు, అభిమానులు పాల్గొన్నారు. నరేష్ అభిమానులు తెచ్చిన కేక్‌ను కట్ చేసి ఆ తరువాత కళాకారులను, సీనియర్ అభిమానులను కొందరిని సన్మానించి మెమొంటోలను ఇచ్చి శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ- నరేష్ కెరీర్ అప్పటికంటే ఇప్పుడే బూస్ట్‌అప్‌లో ఉంది. శతమానంభవతి సినిమా దర్శక నిర్మాతలను ఈ సందర్భంగా సన్మానించుకోవడం సంతోషంగా ఉంది. ఒకప్పుడు నాలుగు భాషల్లో ఒకే సంవత్సరం ఆరు సినిమాలు విడుదలై విజయం సాధించాయి. ఇపుడు నిర్మాత దిల్‌రాజు కూడా ఇదే తరహా విజయాన్ని అందుకుంటున్నారు. ఇక నరేష్ ఇలానే ప్రతి ఏటా ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ఇంకా మంచి పేరు సంపాదించుకోవాలని ఆశీర్వదిస్తున్నాను అన్నారు. విజయనిర్మల మాట్లాడుతూ- పాత్రలకు తగ్గట్టు బాడీ లాంగ్వేజ్‌ను మలచుకునే నటుడు నరేష్. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నా డు. ఇదే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నా అన్నారు. నరేష్ మాట్లాడుతూ- అప్పుడే 50 సంవత్సరాలు అయిపోయాయంటే నమ్మేలా లేదు. ఈ కెరీర్ మొత్తం సజావుగా సాగిపోయింది. నా తల్లిదండ్రుల సమక్షంలో ఇలా ప్రతిఏటా నా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. నాకు ఇన్ని సంవత్సరాలుగా మంచి పాత్రలు ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ప్రేక్షకులకు వినోదాన్ని, ప్రేమను పంచడం నా ధ్యేయంగా పెట్టుకున్నా. నటుడిగా ఎస్‌విఆర్ స్ఫూర్తి, డైనమిజం కృష్ణగారి నుంచి నేర్చుకున్నా. జంధ్యాల నా గురువు. విజయ్‌కృష్ణ పేరుతో ట్రస్ట్‌ను ప్లాన్ చేయనున్నాను అన్నారు.