వెండితెర ‘బంగారు పాప’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణకుమారి.. పాతతరం తెలుగు సినిమా కథానాయిక. పశ్చిమ బెంగాల్‌లో 1933 మార్చి 6న జన్మించారు. షావుకారు జానకి ఈమెకు పెద్దక్క. తండ్రిగారు ఉద్యోగరీత్యా తరచుగా బదిలీల మూలంగా ఈమె విద్యాభ్యాసం రాజమండ్రి, చెన్నై, అస్సాం, కలకత్తా మొదలైన ప్రదేశాల్లో జరిగింది. మెట్రిక్ అస్సాంలో పూర్తయిన తర్వాత మద్రాసు చేరిన వీరి కుటుంబం అక్కడే స్థిరపడింది. తెలుగు సినిమా తెరకు నవ్వితే నవరత్నాలు సినిమా ద్వారా పరిచయం అయ్యారు. ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, జగ్గయ్యలతో హీరోయిన్‌గా ఎన్నో పాత్రలు పోషించారు. సుమారు 110పైగా తెలుగు సినిమాలో నటించారు. బెంగుళూరుకు చెందిన అజయ్ మోహన్ తో 16 మార్చి 1969న పెళ్లి జరిగింది. ఈమెది ఒకరకం గా ప్రేమ వివాహం. ఈమెకు ఒక్కతే కుమార్తె. ప్రస్తు తం పెళ్లి చేసుకుని బెంగుళూరులోనే ఉంటున్నారు.
సినీ జీవితం
ఒకసారి ఆమె తల్లితో సహా స్వప్నసుందరి సినిమా చూడడానికి వెళితే అక్కడికి సౌందరరాజన్‌గారి అమ్మాయి భూమాదేవి కూడా వచ్చింది. సినిమా హాల్లో కృష్ణకుమారిని చూసిన ఆమె తన తండ్రి నిర్మించిన నవ్వితే నవరత్నాలు సినిమాలో హీరోయిన్ అమాయకంగా కనిపించే పాత్ర కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. తర్వాత రోజే వారు కృష్ణకుమారి ఇంటికి వచ్చి తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆమెను హీరోయిన్‌గా ఆ సినిమాలో ఎంపిక చేసుకున్నారు. అలా తెలుగు తెరకు 1951లో ఎంట్రీ ఇచ్చింది. నవ్వితే నవరత్నాలు సినిమా ద్వారా పరిచయం అయినా ఆమె ఆ తర్వాత 1953లో తాతినేని ప్రకాశరావు ఎన్‌ఎటి వారి పిచ్చిపుల్లయ్యలో కథానాయిక వేషం వేయించారు. అందులో మంచి నటన ప్రదర్శించిన కృష్ణకుమారికి పినిశెట్టిగారి పల్లెపడుచు, బంగారుపాప వంటి మంచి చిత్రాలతో పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. తరువాత ఇలవేల్పు, జయవిజయ, అభిమానం, దేవాంతకుడు మొదలైన చిత్రాలలో వివిధ కథానాయకుల సరసన నటించినా, తన నటనకు గుర్తింపు తెచ్చిన చిత్రాలు కె.ప్రత్యగాత్మగారి భార్యాభర్తలు (1961), మరియు కులగోత్రాలు (1962). భార్యాభర్తలులో అభిమానం గల టీచరు శారదగా ఆమె చూపిన నటన అందరినీ ఆకట్టుకుంది. క్లిష్టమైన పాత్రకు న్యాయం చేసి పరిశ్రమ చేత ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. 1963లో లక్షాధికారి, బందిపోటు, ఎదురీత, కానిస్టేబుల్ కూతురు చిత్రాల్లో వైవిధ్యం వున్న పాత్రల వేశారు. ప్రభుత్వ బహుమతి పొందిన జగపతి పిక్చర్స్ వారి అంతస్థులులో నాయికగా నటించారు. 1967-68 మధ్యకాలంలో ఉమ్మడి కుటుంబం, భువనసుందరి కథ, రహస్యం, చిక్కడు దొరకడు, స్ర్తి జన్మ వంటి చిత్రాలలో వైవిధ్యమున్న పాత్రలు పోషించారు. వరకట్నంలో నాయికగా గ్లామరస్ పాత్ర తర్వాత చిత్రాలు తగ్గి 1970 దశాబ్దంలో కొన్ని చిత్రాలలో నటించగలిగారు.
మొత్తంగా సుమారు రెండు దశాబ్దాల నట జీవితంలో ఈమె సుమారు 110 సినిమాలలో నటించారు. వీటిలో ఎక్కువగా ఎతలుగు సినిమాలైతే, 15కన్నడ చిత్రాలు మరియు కొన్ని తమిళ భాషా చిత్రాలు ఉన్నాయి. ఆనాటి మేటి కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్నార్, కాంతారావు, కృష్ణంరాజు, జగ్గయ్య, హరనాథ్ వంటి మహానటులతో నటించి మెప్పించింది. మూడుసార్లు జాతీయ ఆవార్డులు, రాష్ట్ర స్థాయిలో నంది అవార్డులు వచ్చాయి. ఈమె కాంచనమాల, సావిత్రి, ఎన్టీఆర్ అవార్డులు గెలుచుకున్నది. బ్రిటన్‌లోని బర్మింగ్ హాం సంస్థ వారి లైఫ్ టైం అఛీవర్ అవార్డు పొందినది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణకుమారి 2018, జనవరి 24 ఉదయం బెంగుళూరులో మరణించారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కృష్ణకుమారి నటించిన కొన్ని ప్రముఖ చిత్రాలు గుణవంతుడు (1975), నేరము శిక్ష (1973), మానవుడు దానవుడు (1972), భార్యాబిడ్డలు (1971), తల్లా పెళ్లామా (1970), వరకట్నం (1968), చిలక గోరింక (1966), అంతస్థులు (1965), గుడిగంటలు (1965), డా.చక్రవర్తి (1964), బందిపోటు (1963), చదువుకున్న అమ్మాయిలు (1963), వాసంతి, దిల్ ఏక్ మందిర్ (1963), ఇరుగు పొరుగు (1963), పునర్జన్మ (1963), తిరుపతమ్మ కథ (1963), ఎదురీత (1963), కులగోత్రాలు (1962), మోహిని రుగ్మాంగద (1962), భార్యాభర్తలు (1961), సంపూర్ణ రామాయణం (1961), దీపావళి (1960), శాంతినివాసం (1960), వినాయక చవితి (1957),, పిచ్చిపుల్లయ్య (1953), నవ్వితే నవరత్నాలు (1951) లాంటి సినిమాలు ఉన్నాయి.
మొన్నటి తరం కలలరాణి: ‘మా’ సంతాపం
ప్రఖ్యాత సీనియర్ నటి కృష్ణకుమారి మరణం పట్ల ‘మా’ అధ్యక్ష, కార్యదర్శులు శివాజీరాజా, డా.వి.కె నరేష్ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ పాతాలభైరవి, చదువుకున్న అమ్మాయిలు, అంతస్తులు వంటి పలు చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారని, ఆమె మరణం మమ్మల్లి తీవ్రంగా కలిచివేసిందని వారు పేర్కొన్నారు.
బాలకృష్ణ విచారం
అలనాటి మేటి తార కృష్ణకుమారి మరణం పట్ల నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. రామారావుగారు ఎన్‌ఏటి సంస్థలో తొలిసారి స్వయంగా నిర్మించిన ‘పిచ్చిపుల్లయ్య’ (1953)తో సహా దాదాపు పాతిక సినిమాల్లో కృష్ణకుమారి నాన్నగారి సరసన కథానాయికగా నటించారు. దేవాంతకుడు, బందిపోటు, ఉమ్మడి కుటుం బం, వరకట్నం లాంటి సంచలన విజయం సాధించిన చిత్రాల్లోనూ నాన్నగారి సరసన కృష్ణకుమారిగారు నటించడం విశేషం. అటువంటి మేటి నటీమణి నేడు మనమధ్య లేకపోవడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఆమె కుటుం బ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కలిగించాలని కోరుకొంటున్నా.

- శ్రీనివాస్ ఆర్.రావ్