సస్పెన్స్ థ్రిల్లర్‌గా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భ రతవర్ష క్రియేషన్స్ పతాకంపై నూతన నటీనటులతో చెన్నకుని శెట్టి (కుమార్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రం పూజా కార్యక్రమాలు ఫిలిం ఛాంబర్‌లో జరిగాయి. దర్శకుడు సముద్ర, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్, సెక్రటరీ సాయివెంకట్, జివికె 4 మ్యూజిక్ వి.గోపాలకృష్ణ, మురళీ తదితరులు పాల్గొన్నారు. సరికొత్త ఆలోచనలతో యంగ్ అండ్ డైనమిక్ టీం రూపొందిస్తున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు సముద్ర అన్నారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ- ఈ చిత్ర దర్శకుడు మంచి టాలెంటెడ్‌గా అనిపిస్తుంది. మంచి అభిరుచి వున్న టీమ్‌లా కనపడుతున్నారు. నా సహకారం ఎప్పుడూ ఉంటుంది అన్నారు. దర్శకుడు చెన్నకుని శెట్టి (కుమార్) మాట్లాడుతూ- సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నూతన నటీనటులతో పాటు పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు. వినోదంతోపాటు విస్మయానికి గురిచేసే కథాంశమిది. త్వరలోనే చిత్రీకరణను ప్రారంభించనున్నామన్నారు. భరతవర్ష క్రియేషన్స్ బ్యానర్‌లో తొలి చిత్రంగా తెరకెక్కే ఈ చిత్రం టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని అతిథులు, చిత్ర యూనిట్ సభ్యులు ఆకాంక్షించారు.