చేతిలోన చెయ్యేసి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరుణ్ రాహుల్, అంజన జంటగా సుమన్, భానుచందర్ ప్రధాన పాత్రల్లో కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో కె.జె.రాజేష్ నిర్మిస్తున్న చిత్రం ‘చేతిలోన చెయ్యేసి చెప్పు బావ’. ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సాయి వెంకట్ క్లాప్ కొట్టగా నటులు సుమన్, భానుచందర్ దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సంగీత దర్శకుడు పార్థసారథి మాట్లాడుతూ- గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నేను మణిశర్మ దగ్గర చాలా సినిమాలకు పనిచేశాను. సంగీత దర్శకుడిగా కూడా చేశాను. మంచి ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. తప్పకుండా మంచి మ్యూజిక్‌ను ఇస్తాను అన్నారు. నిర్మాత రాజేష్ మాట్లాడుతూ- నిర్మాతగా నా మొదటి ప్రయత్నం ఇది. కథ కూడా నేనే రాసుకున్నాను, మంచి టీమ్‌తో వస్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి అన్నారు. దర్శకుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ- నిర్మాత రాజేష్ మంచి కథ అందించారు. టైటిల్ కూడా అద్భుతంగా వుందని అంటున్నారు అందరూ. కథ విషయానికి వస్తే ప్రేమను దక్కించుకోలేని ఓ జంట మరు జన్మలో ఆ ప్రేమను ఎలా పొందారు? వారి పగను ఎలా తీర్చుకున్నారు? అన్న కథాంశంతో పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాం. ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు షూటింగ్ జరిపి వేసవిలో విడుదల చేస్తామన్నారు.