భిన్నమైన కథనాలతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరాధ్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రదీప్ దర్శకత్వంలో పెనాక దయాకర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘దెయ్యం చెప్పిన కథ’. ఈ చిత్రంలో 29 మంది కొత్త నటీనటులు నటిస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ఎస్.వి.ఎన్.రావు సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను దర్శకుడు ప్రదీప్ తెలియజేస్తూ- తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటివరకూ వచ్చిన దెయ్యం చిత్రాలన్నింటికీ దెయ్యం చెప్పిన కథ కేరాఫ్‌గా నిలుస్తుందని, మూస ధోరణిలో కాకుండా భిన్నమైన కథ, కథనాలతో పూర్తిస్థాయి హర్రర్ చిత్రంగా తెరకెక్కిస్తున్నాం. దెయ్యం ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకుల్ని ఉత్కంఠతకు గురిచేసేలా వుంటుందని, ఓ కొత్త ధోరణిలో హీరో హీరోయిన్లతో సంబంధం లేకుండా కేవలం కధాబలమే సినిమాను నడిపిస్తుందని, కమర్షియల్ హంగులు, సెట్టింగులు కనిపించవని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ- తమ బ్యానర్‌లో వస్తున్న మొదటి చిత్రమిది. చిన్న బడ్జెట్‌లో అనుకున్న స్థాయిలో దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడని, మంచి ప్రతిభ గల దర్శకుడు దొరకడం ఆనందంగా వుందని, ఈ సినిమా తరువాత మళ్లీ ఆయనతో దెయ్యంతో ఓ రాత్రి తీస్తానని, ఫిబ్రవరిలో ప్రారంభిస్తామని, ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేస్తామన్నారు.